చండూరు (చండూరు మండలం)
చండూరు | |
---|---|
Coordinates: 16°59′N 79°04′E / 16.98°N 79.06°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ |
Elevation | 484 మీ (1,588 అ.) |
జనాభా (2001) | |
• Total | 10,762 |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
ISO 3166 code | IN-TG |
Vehicle registration | TS |
చండూరు, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లా, చండూరు మండలానికి చెందిన గ్రామం, అదే పేరుగల మండలానికి కేంద్రం.[2] 1956లో చండూరు పురపాలకసంఘంగా ఏర్పడింది.[3] ఈ ఊళ్ళో పురాతన చండీ విగ్రహం వున్నందున దీనికి చండూరు అని పేరు వచ్చిందని కథనం.ఈ గ్రామం ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ధి.ఇది మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిదిలోకి వస్తుంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[4]
ప్రముఖులు
[మార్చు]ఈ గ్రామానికి చెందిన మద్దోజు సత్యనారాయణ 1930లో జన్మించాడు.ఇతను 1991లో రాసిన మధురస్మృతులు (ఖండకావ్యం)ను సాహితీమేఖల ప్రచురించింది.సాహితీ మేఖల అధ్యక్షుడిగా ఉన్నారు.[5]
రెవెన్యూ డివిజన్‌గా
[మార్చు]2022లో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చండూరును రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామని హామీ మేరకు 2023 జనవరిలో తుది నోటిఫికేషన్‌ను జారీ చేసి, సెప్టెంబర్ 27న చండూరు, మునుగోడు, గట్టుప్పల్ మండలాలను కలుపుతూ నూతనంగా చండూరును రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసింది.[6]
అభివృద్ధి పనులు
[మార్చు]2022 జనవరి 6న తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ గ్రామాన్ని సందర్శించి పట్టణంలో రెండు వరుసల ప్రధాన రహదారి (30 కోట్లు), పట్టణంలో సీసీ రహదారులు-మురుగుకాల్వలు (5.5 కోట్లు), సమీకృత వెజ్ - నాన్వెజ్ మార్కెట్ (2 కోట్లు), షాపింగ్ కాంప్లెక్స్ (50 లక్షలు), నూతన పురపాలిక భవనం (2 కోట్లు) లకు శంకుస్థాపనలు చేశాడు. ఈ కార్యక్రమంలో మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ఎంపీ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook - Nalgonda" (PDF). Census of India. p. 13,398. Retrieved 15 February 2016.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Basic Information of Municipality, Chandur Municipality". chandurmunicipality.telangana.gov.in. Archived from the original on 16 జనవరి 2021. Retrieved 9 April 2021.
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "మరుగున పడిన మన రచయితలు". Retrieved 2018-05-01.
- ↑ Namasthe Telangana (27 September 2023). "రెవెన్యూ డివిజన్‌గా చండూరు.. తుది నోటిఫికేషన్ జారీ.. మరో మూడు మండలాలు కూడా..!". Archived from the original on 27 September 2023. Retrieved 27 September 2023.
- ↑ telugu, NT News (2023-01-06). "హుజూర్‌నగర్‌లో ఈఎస్‌ఐ దవాఖాన ప్రారంభించిన మంత్రి కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-01-06. Retrieved 2023-01-14.
- ↑ "మూడేళ్లలో రూ. 3 వేల కోట్ల అభివృద్ధి: కేటీఆర్". EENADU. 2023-01-07. Archived from the original on 2023-01-07. Retrieved 2023-01-14.