నాని (నటుడు)

వికీపీడియా నుండి
(నానీ (నటుడు) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నాని
2014 జనవరిలో "ఆహా కళ్యాణం" ఆడియో లాంచ్ లో నాని
జననం
ఘంటా నవీన్‍బాబు

(1984-02-24) 1984 ఫిబ్రవరి 24 (వయసు 40)
ఇతర పేర్లునేచురల్ స్టార్ నాని
వృత్తినటుడు,దర్శకుడు,రేడియో వ్యాఖ్యాత,నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2008–ఇప్పటివరకు
జీవిత భాగస్వామియలవర్తి అంజనా (2012–ఇప్పటివరకు)
తల్లిదండ్రులుగంట రాంబాబు, విజయలక్ష్మి

నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు. తరువాత హైదరాబాద్లో కొన్ని రోజులు రేడియో జాకీగా కూడా పనిచేసాడు. ఒక వాణిజ్య ప్రకటన ద్వారా అష్టా చమ్మా అనే తెలుగు సినిమాలో నటించాడు. ఆ తరువాత నానికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. నాని నటించిన ఈగ కూడా ప్రేక్షకులనుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఉన్న హీరోల్లో నాని తన నటనతో న్యాచురల్ స్టార్గా పిలవబడుతున్నాడు. 2015 ప్రథమార్ధంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం 2017 లో వచ్చిన MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం వరకు వరుసగా ఎనిమిది విజయాలను అందుకున్నాడు. 2014 లో నాని నిర్మాతగా డీ ఫర్ దోపిడీ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ! అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా కూడా విజయాన్ని అందుకున్నాడు. 2018 ఏప్రిల్ లో వచ్చిన కృష్ణార్జున యుద్ధంలో నటించాడు. కానీ అది సరి అయిన ఫలితం ఇవ్వలేదు. మా టీవీలో ప్రసారం అయిన బిగ్ బాస్ 2 కి సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు నాని. 2018 లో కింగ్ నాగార్జున అక్కినేని గారితో దేవదాస్ సినిమాలో కలిసి నటించారు. 2019లో జెర్సీ సినిమాతో మన ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. ఫిబ్రవరి 24, 1984 న ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో జన్మించాడు. నాని తల్లిదండ్రులు హైదరాబాదులో స్థిరపడటంతో అతని విద్యాభ్యాసం అక్కడే సాగింది.

కెరీర్

[మార్చు]

సినిమాల్లో నటుడిగా అవకాశాల కోసం ఫోటో ఆల్బంస్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగాడు. చిన్న పాత్రలకు కూడా అవకాశాలు రాకపోవడం, డబ్బులు తీసుకుని మోసపోవడం లాంటి సంఘటనలతో ఆ ప్రయత్నాలు పక్కనబెట్టి దర్శకత్వ శాఖలో అవకాశాల కోసం ప్రయత్నించసాగాడు. మొదటగా దర్శకుడు బాపు దగ్గర క్లాప్ అసిస్టెంట్ గా చేసి, కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. కొన్నాళ్ళు రేడియో జాకీగా కూడా పనిచేశాడు. అష్టా చెమ్మా చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఆ సినిమాలో రాంబాబు పాత్రకు ఆడిషన్స్ జరుపుతుండగా అక్కడి వాళ్ళకి నటన ఎలా చేయాలో చేసి చూపుతున్న నానిని చూసి అతనికే ఆ పాత్ర అవకాశం ఇచ్చాడు. తర్వాత నాని నటించిన రైడ్, స్నేహితుడా సినిమాలు ఒకే ఏడాది విడుదలై పర్వాలేదనిపించాయి.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర సహనటు (లు) ఇతర విశేషాలు
2008 అష్టా చమ్మా మహేశ్,
రాంబాబు
కలర్స్ స్వాతి, శ్రీనివాస్, భార్గవి నాని మొదటి సినిమా
2009 రైడ్ అర్జున్ తనిష్, అక్ష, శ్వేత బసు ప్రసాద్
స్నేహితుడా సాయి మాధవీ లత
2010 భీమిలి కబడ్డి జట్టు సూరి శరణ్య మోహన్, కిషోర్, ధనరాజ్, తాగుబోతు రమేశ్
2011 అలా మొదలైంది గౌతం నిత్యా మీనన్, స్నేహా ఉల్లాల్, ఆశిష్ విద్యార్థి, తాగుబోతు రమేశ్
వెప్పం కార్తీక్ నిత్యా మీనన్, కార్తీక్ కుమార్, బిందు మాధవి తమిళ్ సినిమా,
తెలుగులో సెగ పేరుతో అనువదించబడింది
పిల్ల జమీందార్ ప్రవీణ్ జయరామరాజు హరిప్రియ, బిందు మాధవి, శ్రీనివాస్, రావు రమేశ్
2012 ఈగ నాని సమంత, సుదీప్ ద్విబాషా చిత్రం,
తమిళ్ లో "నాన్ ఈ" పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది
ఎటో వెళ్ళిపోయింది మనసు వరుణ్ కృష్ణ సమంత
నీదానే ఎన్ పొన్వసంతం ట్రైన్ ప్రయాణికుడు అతిథి పాత్ర,
"ఎటో వెళ్ళిపోయింది మనసు" యొక్క తమిళ ఏకకాలనిర్మాణం,
ఇందులో జీవా వరుణ్ పాత్రను పోషించాడు
2013 ఢి ఫర్ దోపిడి చిత్ర సహ నిర్మాత కూడా నానీనే
2014 పైసా
2015 జెండాపై కపిరాజు[2] అమలా పాల్
ఎవడే_సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాళవిక నాయర్,విజయ్ దేవరకొండ
భలే భలే మగాడివోయ్ లక్కరాజు/ లక్కీ లావణ్య త్రిపాఠి,మురళీ శర్మ
2016 కృష్ణగాడి వీరప్రేమ గాథ కృష్ణ మెహ్రీన్ పిర్జాదా
జెంటిల్_మేన్ గౌతమ్,జై(ద్విపాత్రభినయం) నివేదా థామస్
మజ్ను ఆదిత్యా
2017 నేను లోకల్ బాబు కీర్తీ సురేష్
నిన్ను కోరి ఉమా మహేశ్వర రావు నివేదా థామస్,ఆది పినిశెట్టి
2017 మిడిల్ క్లాసు అబ్బాయి నాని సాయిపల్లవి
2018 కృష్ణార్జున యుద్ధం కృష్ణ, అర్జున్ అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్
2018 దేవదాస్[3] దాసు రష్మీక
2019 నాని ‘గ్యాంగ్ లీడర్’ పెన్సిల్ ప్రియాంకా అరుళ్‌ మోహన్
2020 వి విక్రమ్ సుధీర్ బాబు , నివేదా థామస్, అధితి రావు హైదరి
2021 టక్ జగదీష్ జగదీష్ నాయుడు నాని, జగపతి బాబు [4]
శ్యామ్ సింగరాయ్ శ్యామ్ సింగరాయ్ / వాసు (ద్విపాత్రాభినయం) నాని, సాయి పల్లవి, కృతి శెట్టి [5]
2022 అంటే సుందరానికి సుందర ప్రసాద్ నజ్రియా నజీమ్, సుహాస్
హిట్ 2: ద సెకెండ్ కేస్ అర్జున్ సర్కార్ అతిధి పాత్ర
2023 దసరా ధరణి [6]
హాయ్‌ నాన్న మృణాల్ ఠాకూర్ షూటింగ్ ప్రారంభమైంది [7]
2024 సరిపోదా శనివారం [8]
2025 హిట్: ది థర్డ్ కేస్

నిర్మాతగా

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
  1. నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలు: ఉత్తమ నటుడు (ఎటో వెళ్ళిపోయింది మనసు)[10][11][12][13]

మూలాలు

[మార్చు]
  1. "Nani: ఆ రాంబాబేనా ఈ 'ధరణి'?.. ఆసక్తికరం నాని జర్నీ". EENADU. Retrieved 2023-03-28.
  2. "Nani-Amala Paul movie is Janda Pai Kapiraju". Times of India. 30 July 2012. Retrieved 10 January 2020.
  3. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
  4. Eenadu (23 February 2021). "టీజర్‌తోనే అదరగొట్టిన 'టక్‌ జగదీష్‌' - tuck jagadish teaser nani". Archived from the original on 24 February 2021. Retrieved 20 April 2021.
  5. TV9 Telugu (25 October 2020). "Official: నాని 'శ్యామ్‌ సింగరాయ్‌'.. సాయి పల్లవి, కృతి శెట్టి ఫిక్స్‌ - Nani Shyam Singha Roy". Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Nani's rustic and raw first-look as Dharani from Dasara revealed: Spark of Dasara". The Times of India. 20 March 2022. Retrieved 20 March 2022.
  7. Andhra Jyothy (31 January 2023). "కొత్తవాళ్లతో తగ్గేదే లే!". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.
  8. Andhrajyothy (23 October 2023). "వాడ్ని ఎవరైనా ఆపాలని అనుకోగలరా? అనుకున్నా.. ఆపగలరా?". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  9. సాక్షి, సినిమా (28 February 2020). "'హిట్‌' మూవీ రివ్యూ". Sakshi. సంతోష్‌ యాంసాని. Archived from the original on 28 February 2020. Retrieved 29 October 2020.
  10. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 29 June 2020.
  11. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  12. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.
  13. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 29 June 2020.

బయటి లంకెలు

[మార్చు]