బేరియం ఫెర్రైట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బేరియం ఫెర్రైట్ ఒక రసాయనిక అకర్బన సమ్మేళనం. ఈ సమ్మేళనాన్నీ మరియు సంబంధిత ఫెర్రైట్ పదార్థాలను మాగ్నెటిక్ స్ట్రిప్‌కార్డులు, లౌడ్‌స్పీకరులలోని అయస్కాంతాలలో ఉపయోగిస్తారు. బేరియం ఫెర్రైట్ యొక్క రసాయన ఫార్ములా BaFe2O4.బేరియం ఫెర్రైట్ ఫార్ములానుBa2+(Fe3+)2(O2−)4గా కూడా చూపిస్తారు.ఇందులోని Fe3+ కేంద్రకాలు అయస్కాంత గుణత్మాకంగా(ferromagnetically )జతగూడి ఉండును.

నేపధ్యం

బేరియం ఫెర్రైట్ అధిక అయస్కాంత గుణమున్న పదార్ధం.అధిక ప్యాకింగు సాంద్రత కలిగిన లోహ ఆక్సైడ్. 1931 లగాయితు ఈ సమ్మెళన పదార్ధం గురించిన నిరంతరఅధ్యయనం జరిగినట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ , ఈ మధ్య కాలంలో మాగ్నెటిక్ కార్డ్ స్ట్రిప్స్ , స్పీకరులు, మరియు మాగ్నెటిక్ టేపులు తదితరాలలో బేరియం ఫెర్రైట్ వాడకం గణనీయంగా పెరిగినది.ముఖ్యంగా ఎక్కువ కాలం సమాచారాన్ని/దత్తాంశం(data) నిలువఉంచు డేటా స్టోరేజి పరికరాలలో ఉపయోగిస్తారు, బేరియం ఫెర్రైట్ అయస్కాంతతత్త్వం కలిగి ఉండుటయే కాకుండా , ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అయస్కాంతగుణాన్ని నిలుపుకొనే ధర్మం కలిగి ఉండటం,పదార్థ క్షయికరణ నిరోధకం,మరియు ఆక్సీకరణనిలువర గుణం వలన దీని వినియోగం అయస్కాంతపరికారాలలో ఉపయోగించడం పెరిగినది.

నామ ఉత్పత్తి

బేరియం పదం గ్రీకు పదమైన బెరిస్ (barys)నుండి ఏర్పడినది. బెరిస్ అనగా భారమైన(heavy ) అని అర్థం. అలాగే లాటిన్ పదమైన ఫెర్రం(ferrum)ఆధారంగా ఫెర్రస్ (ferrus) అని ఐరన్(Fe) కు నామకరణం చేసారు.ఫెర్రం అనగా పవిత్రమైన లోహం అనిఅర్ధం.ఐరన్ అనేపదం ఆంగ్లో-సాక్సాన్ పదమైన ఐరెన్(iren)నుండి ఏర్పడినది.అయస్కాంతయుతంగా(ferromagnetically0

అణు నిర్మాణం

బేరియం ఫెర్రైట్ అణువులోని Fe3+ అధిక పరిభ్రమణతో d5 విన్యాసం/ ఆకృతి (configuration) కలిగి,జత కూడి ఉండును.

రసాయన ధర్మాలు

బేరియం ఫెర్రైట్‌లు బలిష్టమైన మృత్పరికరములు(robust ceramics).