బేరియం ఫెర్రైట్
బేరియం ఫెర్రైట్ ఒక రసాయనిక అకర్బన సమ్మేళనం. ఈ సమ్మేళనాన్నీ, సంబంధిత ఫెర్రైట్ పదార్థాలను మాగ్నెటిక్ స్ట్రిప్‌కార్డులు, లౌడ్‌స్పీకరులలోనిఅయస్కాంతాలలో ఉపయోగిస్తారు. బేరియం ఫెర్రైట్ యొక్క రసాయన ఫార్ములా BaFe2O4.బేరియం ఫెర్రైట్ ఫార్ములానుBa2+ (Fe3+) 2 (O2−) 4గా కూడా చూపిస్తారు.ఇందులోని Fe3+ కేంద్రకాలు అయస్కాంత గుణత్మాకంగా (ferromagnetically ) జతగూడి ఉండును.
నేపథ్యం
[మార్చు]బేరియం ఫెర్రైట్ అధిక అయస్కాంత గుణమున్న పదార్థం.అధిక ప్యాకింగు సాంద్రత కలిగిన లోహ ఆక్సైడ్. 1931 లగాయితు ఈ సమ్మెళన పదార్థం గురించిన నిరంతరఅధ్యయనం జరిగినట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ, ఈ మధ్య కాలంలో మాగ్నెటిక్ కార్డ్ స్ట్రిప్స్, స్పీకరులు, మాగ్నెటిక్ టేపులు తదితరాలలో బేరియం ఫెర్రైట్ వాడకం గణనీయంగా పెరిగింది.ముఖ్యంగా ఎక్కువ కాలం సమాచారాన్ని/దత్తాంశం (data) నిలువఉంచు డేటా స్టోరేజి పరికరాలలో ఉపయోగిస్తారు, బేరియం ఫెర్రైట్ అయస్కాంతతత్త్వం కలిగి ఉండుటయే కాకుండా, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అయస్కాంతగుణాన్ని నిలుపుకొనే ధర్మం కలిగి ఉండటం, పదార్థ క్షయికరణ నిరోధకం, ఆక్సీకరణనిలువర గుణం వలన దీని వినియోగం అయస్కాంతపరికారాలలో ఉపయోగించడం పెరిగింది.
నామ ఉత్పత్తి
[మార్చు]బేరియం పదం గ్రీకు పదమైన బెరిస్ (barys) నుండి ఏర్పడినది. బెరిస్ అనగా భారమైన (heavy ) అని అర్థం. అలాగే లాటిన్ పదమైన ఫెర్రం (ferrum) ఆధారంగా ఫెర్రస్ (ferrus) అని ఐరన్ (Fe) కు నామకరణం చేసారు.ఫెర్రం అనగా పవిత్రమైన లోహం అనిఅర్ధం.ఐరన్ అనేపదం ఆంగ్లో-సాక్సాన్ పదమైన ఐరెన్ (iren) నుండి ఏర్పడినది.అయస్కాంతయుతంగా (ferromagnetically0
అణు నిర్మాణం
[మార్చు]బేరియం ఫెర్రైట్ అణువులోని Fe3+ అధిక పరిభ్రమణతో d5 విన్యాసం/ ఆకృతి (configuration) కలిగి, జత కూడి ఉండును.
రసాయన ధర్మాలు
[మార్చు]బేరియం ఫెర్రైట్‌లు బలిష్టమైన మృత్పరికరములు (robust ceramics).ఇవి తేమ యొక్క ప్రభావాన్ని నిలువరించును., పదార్థ క్షయికరణను బాగా నిలువరించును.బేరియం ఫెర్రైట్ ఒకఆక్సైడ్, అందువలన ఇది మరితంగా ఆక్సీకరణ చెందే అవకాశం లేదు.
వినియోగం
[మార్చు]బేరియం ఫెర్రైట్ పలుపారిశ్రామిక రంగాలలో విస్తృతంగా వినియోగించబడుచున్నది.
బార్ కోడ్(Barcode)
[మార్చు]ID కార్డులు, వాటి యొక్క రీడర్‌లలోని అయస్కాంత పట్టిలలో బేరియం ఫెర్రైట్‌ను ఒక ప్రత్యేక నమూనా (pattern) తోఉపయోగిస్తారు.స్కానరులు ఈ బేరియం ఫెర్రైట్ యొక్క ప్రత్యేక నామూనాను చిన్న రీడరుల ద్వారా గుర్తించ గలుగుతాయి.
స్పీకరు అయస్కాంతాలు
[మార్చు]స్పీకరులలో ఉపయోగించు సామాన్య పదార్థం బేరియం ఫెర్రైట్.సింటేరింగు (కరిగేంతవరకు వేడి చేయడం) (sintering) అను ప్రక్రియ ద్వారా స్పీకరులలో బేరియం ఫెర్రైట్ కలిగిన అయస్కాంతాలను ఎటువంటి రూపాలలోనైన, వివిధ పరిమాణంలో తయారు చెయ్యవచ్చును.ఈ ప్రక్రియలో పొడి/పుడి (powdered) ని మూస, (పోతపోసే) అచ్చు (mould) లో బలంగా కావలసిన ఆకారంలో వత్తి, ఫెర్రైట్ పౌడర్ కరిగి సమ్మేళనం చెందే వరకు వేడి చెయ్యుదురు. బేరియం ఫెర్రైట్ తన అయస్కాతం ధర్మాలను నిలుపు కొనుచు సాలిడ్ బ్లాక్‌గా ఏర్పడుతుంది .
లీనియర్ టేప్ ఓపన్(Linear Tape-Open)
[మార్చు]లీనియర్ టేప్ ఓపన్ (LTO) లలో సమాచారాన్నిభద్ర పరచు మాధ్యమంగా బేరియం ఫెర్రైట్ ఎంతో ఉపయుక్తమైనదిగా గుర్తించడమైనది.ఈ మధ్య కాలం వరకు LTO లలో సమాచారాన్ని నిల్వఉంచు మాధ్యమంగా లోహ కణాలను/మెటల్ పార్టికిల్స్ ఉపయోగించెడివారు.బేరియం ఫెర్రైట్ అధిక ప్యాకింగ్ సాంద్రత కలిగి ఉండటం వలన టేపుల ఉపరితల వైశాల్యం పెరుగుతున్నది, ఈ కారణంగా అధిక సమాచారాన్ని (data ) ను టేపులో నమోదు (రికార్డ్) చేసి, నిల్వ (దాచి ఉంచుట) టకు సాధ్యమగుచున్నది.