అక్టోబర్ 21
(అక్టోబరు 21 నుండి దారిమార్పు చెందింది)
అక్టోబర్ 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 294వ రోజు (లీపు సంవత్సరములో 295వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 71 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1934: లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జాతీయ కార్యదర్శిగా, ఆచార్య నరేంద్రదేవ్ అధ్యక్షుడిగా 'కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ' ఆవిర్భావం.
- 1943: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సింగపూర్‌లో స్వతంత్ర భారత ప్రభుత్వం (ఆజాద్ హింద్ ప్రభుత్వం) ఏర్పాటు చేసాడు.
- 1954: పాండిచ్చేరి, కారైక్కల్, మాహే లను ఫ్రాన్సు నుండి భారత్‌కు బదిలీ చెయ్యడంపై రెండు దేశాలు సంతకం చేసాయి. నవంవర్ 1 న బదిలీ జరిగింది.
- 1990: దూరదర్శన్ మధ్యాహ్నం వార్తా ప్రసారాలు ప్రారంభం.
జననాలు
[మార్చు]- 1833: ఆల్ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త. (మ.1896)
- 1881: రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (మ.1963)
- 1902: అన్నాప్రగడ కామేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు.
- 1915: విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు
- 1920: తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు
- 1925: సూర్జీత్ సింగ్ బర్నాలా, రాజకీయ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2017)
- 1926: షౌకత్ అజ్మీ, భారతీయ నాటకరంగ, సినిమా నటి. (మ.2019)
- 1930: షమ్మీ కపూర్, భారత సినీనటుడు, దర్శకుడు. (మ.2011)
- 1947: నోరి దత్తాత్రేయుడు, భారతీయ వైద్యుడు, రేడియేషన్ ఆంకాలజిస్టు, అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రి యందు క్యాన్సర్ విభాగానికి అధికారిగా సేవచేస్తున్నాడు.
- 1967: అశ్వనీ నాచప్ప , మాజీ భారతీయ క్రీడా కారిణి, నటి.
- 1978:సంగీత , తెలుగు సినీ నటి , ఒరియా, దక్షిణాది భాషలలో ప్రవేశం.
- 1986: పూనమ్ కౌర్ , తెలుగు,తమిళ, మలయాళ ,నటి,మోడల్
- 1981: లయ, తెలుగు నటి
- 1992: శ్రీనిధి శెట్టి , కన్నడ, తమిళ చిత్రాల నటి , మోడల్.
మరణాలు
[మార్చు]- 1985: పింగళి దశరధరామ్ హేతువాది, పత్రికా సంపాదకుడు.
- 1986: దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు. (జ.1923)
- 1996: పాకాల తిరుమల్ రెడ్డి, చిత్రకారుడు. (జ.1915)
- 2002: హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. (జ.1920)
- 2005: మహీధర నళినీమోహన్, నవలా రచయిత, పాత్రికేయుడు.
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- - పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]- BBC: On This Day
- This Day in History Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 21
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 20 - అక్టోబర్ 22 - సెప్టెంబర్ 21 - నవంబర్ 21 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |