అతీక్ అహ్మద్
అతీక్ అహ్మద్ | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 13 మే 2004 – 16 మే 2009 | |||
ముందు | ధర్మరాజ్ పటేల్ | ||
---|---|---|---|
తరువాత | కపిల్ ముని కర్వరియా | ||
నియోజకవర్గం | ఫూల్‌పూర్ | ||
అధ్యక్షుడు అప్నా దళ్
| |||
పదవీ కాలం 1999 – 2003 | |||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1989 – 2004 | |||
ముందు | గోపాల్ దాస్ యాదవ్ | ||
తరువాత | రాజు పాల్ | ||
నియోజకవర్గం | అలహాబాద్ వెస్ట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ప్రయాగ్‌రాజ్, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం | 1962 ఆగస్టు 10||
మరణం | 2023 ఏప్రిల్ 15 ప్రయాగ్‌రాజ్, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం | (వయసు 60)||
జాతీయత | భారతీయుడు | ||
ఇతర రాజకీయ పార్టీలు | సమాజ్ వాదీ పార్టీ (1993-1999, 2003-2018) అప్నా దళ్ (1999-2003) | ||
జీవిత భాగస్వామి | షైష్టా పర్వీన్ (m. 1996) | ||
సంతానం | 5 కుమారులు | ||
నివాసం | చాకియా, ప్రయాగ్‌రాజ్ | ||
వృత్తి | గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు |
అతిక్ అహ్మద్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు. ఆయన అలాహాబాద్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఫూల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు.
ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసు
[మార్చు]ఉత్తరప్రదేశ్‌లో 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన ఉమేష్ పాల్‌ను పట్టపగలు ఆయన ఇంటి వద్ద కొందరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. 2006 ఫిబ్రవరి 28న అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ కలిసి ఉమేష్ పాల్‌ను కిడ్నాప్ చేసారని ఆ తర్వాత అతను హత్యకు గురయ్యాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య కూడా అతీక్ అహ్మదే చేయించినట్లు మరో కేసు నమోదయ్యింది.
ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో ప్రయాగ్‌రాజ్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు అతీక్ అహ్మద్‌తోపాటు దినేశ్ పాసి, ఖాన్ సౌలత్ హనీఫ్‌ను కూడా కోర్టు ఈ కేసులో దోషులుగా తేల్చి ఆయనకు రూ.5000 జరిమానా, అతీక్ అహ్మద్‌తోపాటు దినేశ్ పాసి, ఖాన్ సౌలత్ హనీఫ్‌ను కూడా కోర్టు ఈ కేసులో దోషులుగా శిక్ష విధించింది.[2][3]
మరణం
[మార్చు]ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో వైద్య పరీక్షల నిమిత్తం అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ ను పోలీసులు ఆసుపత్రికి తీసుకవచ్చారు, ఈ సమయంలో అక్కడికి వచ్చిన మీడియాతో అతిక్ అహ్మద్ మాట్లాడుతూ ఉండగా ముగ్గురు వ్యక్తులు అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ పై లవ్లేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్య కాల్పులు జరపగా వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (6 January 2023). "సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ భార్య బీఎస్పీలో చేరిక". Archived from the original on 15 April 2023. Retrieved 15 April 2023.
- ↑ Eenadu (29 March 2023). "మాజీ ఎంపీ అతీక్ అహ్మద్‌కు జీవితఖైదు". Retrieved 15 April 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ TV9 Telugu (28 March 2023). "17ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు సంచలనం.. మాఫియా డాన్, మాజీ ఎంపీకి జీవిత ఖైదు." Archived from the original on 15 April 2023. Retrieved 15 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (16 April 2023). "గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ సోదరుల హత్య". Archived from the original on 16 April 2023. Retrieved 16 April 2023.