అనుదీప్ దురిశెట్టి
దురిశెట్టి అనుదీప్ | |
---|---|
జననం | 6 జులై 1990 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ |
జీవిత భాగస్వామి | మాధవి [1] |
తల్లిదండ్రులు |
|
దురిశెట్టి అనుదీప్ 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన సివిల్ సర్వీసెస్ - 2017 ఫలితాల్లో దేశంలోనే నెంబర్‌వన్ ర్యాంకును సాధించాడు.[3] అనుదీప్ దురిశెట్టి ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]అనుదీప్ దురిశెట్టి 7 జులై 1990లో తెలంగాణ రాష్ట్రం , జగిత్యాల జిల్లా , మల్లాపూర్ మండలం, చిట్టాపూర్ గ్రామంలో దురిశెట్టి మనోహర్, జ్యోతి దంపతులకు జన్మించాడు. ఆయన మెట్‌పల్లిలోని సూర్యోదయ హైస్కూల్ లో పదవ తరగతి వరకు చదివి, హైదరాబాద్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎమ్‌సెట్‌లో స్టేట్ 45వ ర్యాంక్ సాధించాడు. అనుదీప్ రాజాస్థాన్‌లోని బిట్స్ పిలానిలో ఎలెక్ట్రానిక్స్ & ఇంస్ట్రుమెంటలిజం ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశాడు.[4]
జీవితం
[మార్చు]అనుదీప్ దురిశెట్టి రాజాస్థాన్‌లోని బిట్స్ పిలానిలో ఇంజనీరింగ్ 4వ సంవత్సరంలో ఉన్నప్పుడే ఢిల్లీలో సివిల్స్‌కి కోచింగ్ తీసుకున్నాడు. ఆయన 2012లో మొదటి ప్రయత్నంలో ర్యాంక్ సాదించలేకపోయాడు, 2013లో రెండవ ప్రయత్నంలో790 ర్యాంక్ సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్)కు సాధించాడు. ఆయన సర్వీసులో చేరి ఐఆర్‌ఎస్ ప్రొబేషనరీ ట్రైనింగ్ తీసుకుంటూనే ఆశించిన స్థాయి ఫలితం రాలేదనే కసితో మళ్లీ సివిల్స్ కు ప్రిపేర్ అయి 3వ, 4వ ప్రయత్నాల్లో కూడా ఐఏఎస్ కావాలన్న లక్ష్యం నెరవేరకపోవడంతో అయిదో ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ - 2017 ఫలితాల్లో ఏకంగా జాతీయ స్థాయిలో 1వ ర్యాంక్ సాధించిన తన కలను నెరవేర్చుకున్నాడు.[5][6]
ఉద్యోగ జీవితం
[మార్చు]దురిశెట్టి అనుదీప్ 2013లో రెండో ప్రయత్నంలో 790 ర్యాంక్ సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్)కు ఎంపికయ్యాడు. ఆయన ఐఆర్‌ఎస్ ట్రెయినీ బ్యాచ్‌లో ఆయుధ శిక్షణ ప్రోగ్రామ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకుగాను ఎన్‌ఐఎస్ఏ, హైదరాబాద్ నుంచి ఉత్తమ ట్రెయినీ ఆఫీసర్‌గా అవార్డు అందుకున్నాడు. ఆయన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో సెంట్రల్ కస్టమ్స్ జీఎస్పీలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేశాడు.
ఐఏఎస్ అధికారిగా
[మార్చు]అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ అయ్యాక 2018లో మొట్ట మొదటగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టరుగా విధుల్లో చేరాడు. 2021 జూన్ 1న అంతకుముందున్న ఎంవి రెడ్డి పదవి విరమణ పొందడంతో భద్రాద్రి జిల్లా కలెక్టరుగా బాధ్యతలు చేపట్టి[7], 2023 జులై 14న హైదరాబాద్ కలెక్టర్‌గా నియమితుడయ్యాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ Suryaa (10 November 2021). "ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సతీమణి ప్రసవం". Archived from the original on 11 November 2021. Retrieved 11 November 2021.
- ↑ Sakshi (8 May 2018). "సివిల్స్ ఫస్ట్ ర్యాంక్‌తో సర్‌ప్రైజే ఇచ్చాడు". Archived from the original on 11 November 2021. Retrieved 11 November 2021.
- ↑ Sakshi (27 April 2018). "సివిల్స్ టాపర్ తెలుగు విద్యార్థి". Archived from the original on 11 November 2021. Retrieved 11 November 2021.
- ↑ Andrajyothy (30 April 2018). "కన్నవారికి ఇంతకన్నా ఏం కావాలి?". Archived from the original on 11 November 2021. Retrieved 11 November 2021.
- ↑ Deccan Chronicle (28 April 2018). "Anudeep Durishetty tops at UPSC" (in ఇంగ్లీష్). Archived from the original on 11 November 2021. Retrieved 11 November 2021.
- ↑ Sakshi (30 April 2018). "ఇదే దురిశెట్టి అనుదీప్ గెలుపుబాట". Archived from the original on 11 November 2021. Retrieved 11 November 2021.
- ↑ Dec 20, TNN / Updated:; 2020; Ist, 08:34. "Seven IAS officers in Telangana set to retire in 2021 | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-11-11.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (14 July 2023). "రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి". Archived from the original on 14 July 2023. Retrieved 14 July 2023.