ఆరోగ్యప్రకాశిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరోగ్య ప్రకాశిక

ఆరోగ్యాభివృద్ధి సాధకమగు నాంధ్ర సచిత్ర మాసపత్రికగా ఆరోగ్య ప్రకాశిక మద్రాసు నుండి వెలువడినది. 1925 మే నెలలో మొదటి సంచిక వెలువడింది. డాక్టరు యు.రామారావు, డాక్టరు యు.కృష్ణారావు ఈ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ఈ పత్రికలో వివిధ వ్యాధులు వాటి చికిత్సలు, వ్యాధులు ప్రబలకుండా ఉండేదుకు తీసుకొనవలసిన జాగ్రత్తలు, మద్యపానముల వలన సంభవించే కష్టనష్టాలు, ఆరోగ్య నియమాలు, పారిశుద్ధ్యము, ప్రసవము, బాలింతరాండ్ర సంరక్షణ, శిశుపోషణము, పిల్లలకు పరిచర్య మొదలైన విషయాలు ఉండేవి. ఈ పత్రిక సంపాదకులు 1923లో హెల్త్ అనే పేరుతో ఒక ఆంగ్ల పత్రిక ప్రారంభించారు. ఆ తరువాత కన్నడ అరవ భాషలలో కూడా ఆ పత్రికను నడిపారు. తెలుగు పాఠకుల ఉపయోగార్థం హెల్త్ పత్రికను ఆరోగ్య ప్రకాశిక పేరుతో తెలుగులో తీసుకువచ్చారు. గుడ్ హెల్త్, హెల్త్ స్ట్రెంగ్త్ మొదలైన ఇంగ్లీషు పత్రికలలోని వ్యాసాలు తర్జుమా చేసి ఈ పత్రికలో ప్రచురించేవారు. ఈ పత్రిక 14 సంవత్సరాలకు పైగా నడిచింది.

పత్రికలోని విషయాలు

[మార్చు]

1928 జూన్ సంచికలో ఈ క్రింది విషయాలు ప్రచురించారు.

  • క్షయవ్యాధి - చికిత్స
  • మనుష్యులలో హెచ్చుమందిని చంపుటకు కారణమైన దారుణ విషము సారాయియే!
  • ఈగలేమి మాటలాడుకొనును? (సంభాషణ)
  • కలరా వ్యాధి రాకుండ చేయుట
  • నిద్ర పట్టక పోవుట
  • ఆరోగ్య నియమములు
  • బిడ్డలలో స్త్రీ పురుష భేదము
  • ఈళ్లును, పేలును పోవుటకు మందు
  • జలుబు చేయకుండుటకు సాధనములు

మూలాలు

[మార్చు]