కస్తూరి శంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కస్తూరి శంకర్
జననం (1970-05-01) 1970 మే 1 (వయసు 54)
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు1991-2001
2009-ప్రస్తుతం

కస్తూరి శంకర్ (జననం 1970 మే 1) భారతీయ సినీనటి, మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో నటిస్తోంది.[1] స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మిలో తులసి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.[2] ఆమె మద్రాసులో ఉన్నత పాఠశాలలో ఉండగానే మోడలింగ్ ప్రారంభించింది.[3] ఆమె 1992లో మిస్ మద్రాస్ టైటిల్ గెలుచుకుంది. 1991లో ఆతా ఉన్ కోయిలిలే తమిళ చిత్రంతో కస్తూరి శంకర్ సినిమాలలో అడుగుపెట్టింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కస్తూరి శంకర్ 2000లో డాక్టర్ రవికుమార్‌ని వివాహం చేసుకుంది.[4] ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె కుమార్తె లుకేమియా నుండి బయటపడింది.[5]

కెరీర్

[మార్చు]

చెన్నైలోని ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తూనే 1992లో కస్తూరి శంకర్ మిస్ చెన్నైగా గెలుపొందింది. రాష్ట్ర స్థాయి హాకీ ఛాంపియన్, వైమానిక దళ విభాగంలో ఆర్.డి క్యాడెట్‌గా వ్యవహరించడం ఆమె యుక్తవయసులో సాధించిన అనేక విజయాలలో ఒకటి. ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’. ఆమె విజయవంతమైన మోడల్ మాత్రమే కాదు, ఆమె బిబిసి మాస్టర్ మైండ్ ఇండియా 2000 క్విజ్‌లో ఫైనలిస్ట్ కూడా. ఆమె నటనా జీవితం 1991లో ఆతా ఉన్ కోయిలీలే చిత్రంతో ప్రారంభమైంది. చిన్న బడ్జెట్ తమిళ చిత్రాలలో పని చేయడం నుండి, ఆమె కమల్ హాసన్ వంటి లెజెండ్స్‌తో భారతీయుడు (1996) వంటి చిత్రాలలో పనిచేసింది. చిత్ర పరిశ్రమలో ఆమె సాధించిన విజయానికి గుర్తింపుగా 30 నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీ చిత్రం కస్తూరి: సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్ విడుదలైంది. అన్నమయ్య (1997)లో తన నటనా నైపుణ్యం, కాదల్ కవితై (1998)లో నృత్య ప్రదర్శన ద్వారా ఆమె అందరిని మెప్పించింది. పెళ్లి తర్వాత కెరీర్‌కి బ్రేక్‌ తీసుకుని ఆమె అమెరికాలో స్థిరపడింది.

అయితే, ఆమె తిరిగి కెరీర్ లో రాణించాలని భారతదేశం వచ్చేసింది. ఆమె తొలి పునరాగమన చిత్రం మలై మలై (2009), పుతుయుగం టీవీలో 2013-2014 మధ్య కాలంలో ప్రసారమైన విన విదై వెట్టై లో కూడా నటించింది. ఆమె ది టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికలో కాలమ్ రాస్తూ సామాజిక సమస్యలపై తన స్వరాన్ని తరచుగా వినిపిస్తుంది.[6]

ఆమె ముఖ్యంగా అధిక్ రవిచంద్రన్ సారథ్యంలో వచ్చిన అన్బనవన్ అసరాధవన్ అడంగాధవన్ (2017)లో సిలంబరసన్‌ (శింబు)తో కలిసి పరిశోధనాత్మక ఏజెంట్‌గా కీలకమైన సహాయ పాత్రను పోషించింది.[7]

2018లో తమిళ రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ తమిళ్‌లో కనిపించే అవకాశాన్ని తిరస్కరించిన ఆమె 2019లో షో మూడవ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌గా చేరింది.[8]

1990లలో కుముదం పత్రికలో "కీప్ ఇట్ సింపుల్ స్టుపిడ్" అనే శీర్షికతో వారానికో కాలమ్ కస్తూరి శంకర్ రాసింది.[9]

వివాదాస్పదం

[మార్చు]

2014లో టాప్‌లెస్ ఫోటోషూట్ ద్వారా కస్తూరి శంకర్ వార్తల్లో వ్యక్తిగా మారింది. జేడ్ బెల్ పుస్తకం ది బాడీస్ ఆఫ్ మదర్స్: ఎ బ్యూటిఫుల్ బాడీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆమె అర్థనగ్నంగా ఫోటోలకి ఫోజులిచ్చింది.[10][11][12] అయితే ఆ షూట్ తరువాత భారతీయ వెబ్‌సైట్‌లు చట్టవిరుద్ధంగా వీటిని పంచుకున్నాయి. ఆ సైట్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కస్తూరి శంకర్ ప్రకటించింది.

సోషల్ మీడియా

[మార్చు]

సామాజిక సమస్యలపై నిత్యం సోషల్ మీడియాలో గళం వినిపించే కస్తూరి శంకర్ తాజాగా స‌రోగ‌సీ పై ట్వీట్ చేసింది. న‌టి న‌య‌నతార‌, ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ దంప‌తులు స‌రోగ‌సీ ద్వారా క‌వ‌ల పిల్ల‌లకు త‌ల్లిదండ్రులైయ్యారు. ఈ విషయాన్ని 2022 అక్టోబరు 9న వారు ప్రకటించిన కాసేప‌టికే కస్తూరి శంకర్ స‌రోగ‌సీపై ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. "భార‌తదేశంలో స‌రోగ‌సీపై నిషేధం ఉంది. 2022 జనవరి నుంచి ఈ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చింది. క్లిష్ట ప‌రిస్థితుల్లో త‌ప్ప స‌రోగ‌సీని అనుమతించరు. రానున్న రోజుల్లో దీని గురించి ఎక్కువ‌గా విన‌బోతున్నాం" అన్నది ఆమె ట్వీట్‌ సారాంశం. దీనికి న‌య‌నతార అభిమానులు కస్తూరి శంకర్ పై మండిపడ్డారు.[13]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
1991 ఆత అన్ కోయిలీలే కస్తూరి తమిళం
చక్రవర్తి ప్రసీత మలయాళం
రసతి వారు నాల్ రాధ తమిళం
1992 ప్రభుత్వ మాప్పిళ్ళై మల్లారియా
చిన్నవర్ మీనా
ఉరిమై ఊంజలాడుగిరాడు ఉమా
సెంథమిజ్ పట్టు షణ్మతి
అభిరామి ధనం
గ్యాంగ్ వార్ కావేరి తెలుగు
1993 రక్కాయి కోయిల్ వెల్లైయమ్మ తమిళం
పుధియ ముగం రాజా మొదటి భార్య
పాస్ మార్క్ శాంతి
ఆత్మ ఉమా
ఉడాన్ పిరప్పు సుమతి
నిప్పు రవ్వ భారతి తెలుగు
ఎంగ ముతాలాలి కల్యాణి తమిళం
1994 అమైధి పాడై తాయమ్మ
వాచ్‌మెన్ వడివేల్ రాధ
రాజా పాండి పొన్నుతాయి
తెండ్రాల్ వరుమ్ తేరు నళిని
జానా కస్తూరి కన్నడ
1995 సింధు బాత్ శోభన తమిళం
చిన్న మణి చిన్న మణి
కొలంగల్ ఉమా
ఆకాయ పూకల్ కామాక్షి
గాడ్ ఫాదర్ అరుణ తెలుగు
అగ్రజన్ శ్రీదేవి మలయాళం
రధోల్సవం చెంపకం
అనియన్ బావ చేతన్ బావ అమ్ము
1996 ఇబ్బర నడువే ముద్దిన ఆట కన్నడ
భారతీయుడు కస్తూరి తమిళం
కృష్ణుడు లిజీ
సోగ్గాడి పెళ్ళాం జ్యోతి తెలుగు
మెరుపు ప్రేమ
రెండు కుటుంబ కథ హేమ
1997 చిలక్కొట్టుడు కస్తూరి
రథ యాత్ర గంగ
అన్నమయ్య అక్కలమ్మ
మా ఆయన బంగారం
1998 మాంగల్య పల్లక్కు సీతాలక్ష్మి మలయాళం
తుట్ట ముట్ట డాక్టర్ సీమ కన్నడ
అతడే ఒక సైన్యం కస్తూరి
స్నేహం రాధిక మలయాళం
కాదల్ కవిధై స్వప్న తమిళం
1999 హబ్బా అను కన్నడ
సుయంవరం ఉమా తమిళం
పంచపాండవర్ నందిని మలయాళం
2001 ఎంగలుక్కుమ్ కాలం వరమ్ పూజ తమిళం
దోస్త్ "హే సాల్ సాల్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
ఆకాశ వీధిలో పద్మ తెలుగు
ప్రేమక్కే సాయి వేద కన్నడ
2002 అధీనా యువరాణి అధినా మలయాళం
2009 మలై మలై లక్ష్మి తమిళం
2010 తమిళ్ పదం "కుత్తువిళక్కు" పాటలో ప్రత్యేక పాత్ర
గూడు గూడు గుంజాం మల్లీశ్వరి తెలుగు
డాన్ శీను లక్ష్మి
2011 పఠినారు ఇళవరసి తమిళం అతిథి పాత్ర
తూంగా నగరం ప్రత్యేక ప్రదర్శన
2012 నాంగా చిత్ర
2013 అజగన్ అజగి "ఏతువరై వానం" పాటలో ప్రత్యేక పాత్ర
నాన్ రాజవగా పొగిరెన్ భారతి
2014 వడకూర సతీష్ కోడలు
నాన్ పొన్ను ఒండ్రు కండేన్ "ఒతయ రెతాయ" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2017 అన్బానవన్ అసరాధావన్ అడంగాధవన్ రూబీ
శమంతకమణి కృష్ణుని తల్లి తెలుగు
2018 ట్రాఫిక్ రామసామి కోర్టులో సాక్షి తమిళం అతిథి పాత్ర
తమిళ్ పదం 2 "వా వా కామ" పాటలో ప్రత్యేక పాత్ర
2020 వెల్వెట్ నగరం గౌరీ
2021 EPCO 302 S. దుర్గా IPS
2022 గాడ్ ఫాదర్ బ్రహ్మ తల్లి తెలుగు
2023 తమిళరసన్ తమిళం
రాయర్ పరంబరై రాయర్ సోదరి తమిళం
స్ట్రైకర్ తమిళం
2024 సింబా తెలుగు
టెలివిజన్
సంవత్సరం పేరు పాత్ర భాష ఛానెల్ గమనికలు
ఏష్టదానం మలయాళం DD మలయాళం క్రమ
1995 కాయలవు మనసు వాణి తమిళం సన్ టీవీ క్రమ
2000 సూత్రధారి భారతదేశం పోటీదారు తమిళం BBC
2010 సూర్య కుటుంబం అవార్డులు 2010 హోస్ట్ సన్ టీవీ
2010 స్టార్ సింగర్ ప్రత్యేక న్యాయమూర్తి మలయాళం ఏషియానెట్ వాస్తవిక కార్యక్రమము
2013-14 విన విదై వేట్టై హోస్ట్ తమిళం పుతుయుగం టీవీ
2014 విన విదై వెట్టై జూనియర్స్ హోస్ట్ పుతుయుగం టీవీ
2014 వావ్ 2 పాల్గొనేవాడు తెలుగు E TV
2019 బిగ్ బాస్ తమిళ్ 3 పోటీదారు తమిళం స్టార్ విజయ్ తొలగించబడిన

రోజు 63

2020 - 2024 ఇంటింటి గృహలక్ష్మి తులసి తెలుగు స్టార్ మా క్రమ
2020 నగదు పాల్గొనేవాడు తెలుగు ETV వాస్తవిక కార్యక్రమము
2020 అగ్ని నక్షత్రం రుద్ర తమిళం సన్ టీవీ క్రమ
2021 పరంపర ఇందిర తెలుగు డిస్నీ+ హాట్‌స్టార్ వెబ్ సిరీస్
2021 సిక్స్త్ సెన్స్ పాల్గొనేవాడు తెలుగు స్టార్ మా ఆటల కార్యక్రమం
2022 అరువి ఆమెనే తమిళం సన్ టీవీ క్రమ
2022 శ్రీదేవి డ్యాన్స్ కంపెనీ ఆమెనే తెలుగు ETV
2024 సీతే రాముడికి కట్నం రాముని తల్లి తెలుగు జీ తెలుగు

మూలాలు

[మార్చు]
  1. https://www.filmibeat.com/tamil/news/2020/kasthuri-shankar-reveals-why-she-is-tight-lipped-about-her-husband-305399.html
  2. Pasupuleti, AuthorPriyanka. "Kasthuri Shankar testing her luck on small screen". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-04.
  3. "Exclusive biography of #Kasthuri and on her life".
  4. James, Anu (2015-10-29). "Actress Kasthuri goes topless to highlight motherhood, photos go viral". www.ibtimes.co.in (in ఇంగ్లీష్). Retrieved 2021-06-02.
  5. "Casting couch in filmdom isn't a myth, it does exist - Times of India". The Times of India.
  6. "Kollywood Movie Actress Kasthuri Biography, News, Photos, Videos".
  7. "I am too old for Vijay, too young for Rajinikanth: Kasthuri".
  8. "Bigg Boss Tamil 3 contestant Kasthuri makes shocking revelations over her payment dues".
  9. "Bittorrent coin deutsch-the best payaone". Archived from the original on 20 April 1999.
  10. "Actor Kasthuri's photo shoot for motherhood wins hearts, she says amazed at response". The News Minute. 2015-10-30. Retrieved 2019-10-21.
  11. "Actress Kasthuri Poses Semi-nude for Photo-book 'Bodies of Mothers'". The New Indian Express. Retrieved 2021-06-25.
  12. Team, DNA Web (2015-10-31). "South Indian actress Kasthuri poses topless for Jade Beall's 'A Beautiful Body Project'". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-25.
  13. "Kasthuri: 'సరోగసి'పై నటి ట్వీట్‌ దుమారం." web.archive.org. 2022-10-11. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)