గండిగుంట
గండిగుంట | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°22′45″N 80°50′11″E / 16.379127°N 80.836337°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | వుయ్యూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ గుండె రాంబాబు |
పిన్ కోడ్ | 521165 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
గండిగుంట, కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ భౌగోళికం
[మార్చు]ఇది సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తులో ఉంది
సమీప గ్రామాలు
[మార్చు]గుడివాడ, విజయవాడ, తెనాలి, మంగళగిరి
ప్రముఖులు
[మార్చు]- దండమూడి రాజగోపాలరావు - (అక్టోబరు 16, 1916 - ఆగష్టు 6, 1981) ఇతను భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, "ఇండియన్ టార్జన్" అన్న బిరుదు పొందాడు.తెలుగు రంగస్థల, సినిమా నటుడు.1963లో విడుదలైన నర్తనశాల[1] సినిమాలో, 1965లో విడుదలైన వీరాభిమన్యు సినిమాలో భీముడు పాత్ర పోషించాడు.
గ్రామ విశేషాలు
[మార్చు]- "గండిగుంట" అది నిర్మలమైన గ్రామం. అక్కడ పచ్చని పొలాలు, తేట తేట చెరువులు, అహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది.
- ఈ గ్రామానికి చెందిన దండమూడి ప్రసాదరావు 45 సంవత్సరాలనుండి పశుపోషకులు. ఇతను వరుసగా 10 సంవత్సరాల నుండి, గండిగుంట పాలకేంద్రంలో అత్యధికంగా పాలు సరఫరా చేసే పాల ఉత్పత్తిదారుగా, కృష్ణా జిల్లా పాలసంఘం అందించు ప్రోత్సాహక బహుమతులు అందుకుంటున్నాడు.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]వుయ్యూరు, మానికొండ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 33 కి.మీ.దూరంలో ఉంది.
గ్రామంలోని విద్యాసౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, కాకానినగర్. రవీంద్రభారతి స్కూల్, నారాయణ టెక్నో ప్రాథమిక పాఠశాల, శ్రీ చైతన్య టెక్నో స్కూల్, ఉయ్యూరు
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
[మార్చు]వ్యవసాయ మార్కెట్ యార్డ్.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సంగాని నాగకుమారి, సర్పంచిగా ఎన్నికైంది.[2]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ కోదండరామస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయం స్థానిక ఎన్.టి.ఆర్.సర్కిల్ సమీపంలో ఉంది.
శ్రీ దత్త దేవాలయం
[మార్చు]ఈ దేవాలయంలో, శ్రీ అనఘాసమేత దత్తదిగంబరస్వామి కొలువై యున్నారు. 19-11-2013 మంగళవారం నాడు స్వామి జయంతిని పురస్కరించుకొని ఆలయంలో వివిధ పూజలు నిర్వహించారు. స్వామివారి గ్రామోత్సవం, గోపూజ అనంతరం, లక్ష తులసి దళార్చనతో, దత్తాత్రేయునికి అర్చన చేశారు. లోకకళ్యాణార్ధం హోమం నిర్వహించారు. అన్నసమారాధన చేశారు.[3]
ఈ క్షేత్రం ఏర్పడి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా, 2016, జనవరి-9వ తేదీ శనివారంనాడు, మహాసంప్రోక్షణ-బ్రహ్మ కలశాభిషేకం, వేదపారాయణం, హోమాలు నిర్వహించారు.
శ్రీ అయ్యప్పస్వామి దేవస్థానం
[మార్చు]ఈ దేవస్థానంలో, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, 2007 నుండి మాలలు ధరించిన అయ్యప్ప దీక్షాపరులకు ఉచిత అన్నసమారాధన కార్యక్రమం, బహు నియమనిష్ఠలతో జరుగుచున్నది. ఈ కార్యక్రమం ప్రతిసంవత్సరం నవంబరు 21 నుండి జనవరి 10 వరకూ జరుగుతుంది. ప్రతి రోజూ, ఉయ్యూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాలకు చెందిన 500 మంది అయ్యప్ప దీక్షాపరులు ఇక్కడ భోజనం చేస్తున్నారు. దీనికి దాతల సహకారం మరువలేనిది.[4]
ఈ ఆలయంలో ఉపాలయంగా శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం ఉంది.[5]
శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, 2017, ఆగస్టు-12వతేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు.[6]
మూలాలు
[మార్చు]- ↑ http://www.imdb.com/title/tt0263778/
- ↑ ఈనాడు విజయవాడ/పెనమలూరు:- 25, జులై-2013.6వ పేజీ.
- ↑ ఈనాడు విజయవాడ/పెనమలూరు, 20 నవంబర్, 2013. 1వ పేజీ.
- ↑ ఈనాడు కృష్ణా/పెనమలూరు; 5,డిసెంబరు,2013. 2వ పేజీ.
- ↑ ఈనాడు విజయవాడ, 30 నవంబర్ 2013.9వపేజీ.
- ↑ ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017,ఆగష్టు-13; 1వపేజీ.