గోల్‌మాల్ (సినిమా)
గోల్‌మాల్ (2003 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.ఎన్.రామచంద్రరావు |
---|---|
నిర్మాణం | పి.ఎన్.రామచంద్రరావు |
తారాగణం | జె.డి.చక్రవర్తి, రమేష్ అరవింద్, నేహా, మీరా వాసుదేవన్ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | శ్రీ గాయత్రి కళాచిత్ర |
భాష | తెలుగు |
గోల్‌మాల్ పి.ఎన్.రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో శ్రీ గాయత్రి కళాచిత్ర బ్యానర్‌పై నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 2003, ఫిబ్రవరి 21న విడుదలయ్యింది.[1] ఇది 1994లో వచ్చిన మలప్పురం హాజి మహానాయ జోజి అనే మలయాళం సినిమా రీమేక్.
నటీనటులు
[మార్చు]- జె.డి.చక్రవర్తి - అమీర్ ఖాన్
- రమేష్ అరవింద్ - అమర్ శాస్త్రి
- నేహా పెండ్సే బయాస్ - ముంతాజ్
- మీరా వాసుదేవన్ (తొలి పరిచయం) - మీనాక్షి
- బ్రహ్మానందం
- సుధాకర్
- ఎ.వి.ఎస్.
- గిరిబాబు
- జయప్రకాశ్ రెడ్డి - నరహరి
- గుండు హనుమంతరావు
- పద్మనాభం
- తోటపల్లి మధు
- రఘుబాబు
- నవభారత్ బాలాజీ
- ఎ.వి.నాగేంద్రప్రసాద్
- అనితా చౌదరి
- బేబీ శ్రావ్య
- మాస్టర్ కార్తీక్
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకుడు, నిర్మాత: పి.ఎన్.రామచంద్రరావు
- సంభాషణలు : తోటపల్లి మధు
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- పాటలు: వేటూరి, చంద్రబోస్, డాడీ శ్రీనివాస్
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, దేవిశ్రీ ప్రసాద్, ఉష, కార్తీక్, సునీత
- ఛాయాగ్రహణం: ఎం. వి. రఘు
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నృత్యాలు: సుచిత్ర, రాజశేఖర్
పాటలు
[మార్చు]- ఒహో ఒహో ఖజురహో కళలవిగో అహో అహో అదరహో కథలివిగో
కథ
[మార్చు]అమీర్ ఖాన్, అమర్ శాస్త్రి ఇద్దరూ స్నేహితులు. అమీర్ ఖాన్ ధనవంతుల బిడ్డ. అతనికి అమెరికా వెళ్ళి పెద్ద ఉద్యోగం చేయాలని కోరిక. అమర్ శాస్త్రి పేదవాడు. కుటుంబ బాధ్యతలను అతని భుజాలపై మోస్తుంటాడు. హైదరాబాదులో తన స్నేహితుడు అబ్దుల్లా నడుపుతున్న కాలేజీలో ఉద్యోగానికి కుదుర్చుతాడు అమీర్ ఖాన్ తండ్రి తన కొడుకును. తన బదులుగా అమర్‌ను అమీర్ పేరుతో లెక్చరర్‌గా చేరమని అమీర్ ఖాన్ అభ్యర్థిస్తాడు. అబ్దుల్లా కూతురు అమీర్‌ను ప్రేమిస్తుంది. అబ్దుల్లా పోటీదారుడు నరహరి. అమెరికా వెళ్ళడానికి వీసాకోసం ప్రయత్నించిన అమీర్ ఖాన్ ముంబాయిలోని వీసా ఏజెంటుతో మోసానికి గురై తిరిగి హైదరాబాద్‌కు వచ్చి అమర్ పేరుతో నరహరి నడిపే సంస్థలో ఉద్యోగానికి చేరుతాడు. నరహరి కూతురు మీనాక్షి అమీర్ రూపంలో ఉన్న అమర్‌ను ప్రేమిస్తుంది. ఈ రెండు జంటలు తమ ప్రేమను గెలుచుకోవడానికి చేసే ప్రయత్నాలే ఈ హాస్య చిత్రం కొనసాగింపు.[2]
మూలాలు
[మార్చు]- ↑ web master. "Golmal (P.N. Ramachandra Rao) 2003". indiancine.ma. Retrieved 18 November 2022.
- ↑ web master. "Golmaal Story". ఫిల్మీబీట్. Retrieved 18 November 2022.
బయటి లింకులు
[మార్చు]- 2003 తెలుగు సినిమాలు
- జె.డి.చక్రవర్తి సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- సుధాకర్ నటించిన సినిమాలు
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- రఘుబాబు నటించిన సినిమాలు
- జయప్రకాశ్ రెడ్డి నటించిన సినిమాలు
- గుండు హనుమంతరావు నటించిన సినిమాలు
- పద్మనాభం నటించిన సినిమాలు
- వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన సినిమాలు
- రీమేక్ సినిమాలు