జుట్టు నరసింహం
జుట్టు నరసింహం | |
జన్మ నామం | నరసింహన్ |
జననం | 1931 |
మరణం | మార్చి 11, 2009 చెన్నై |
ఇతర పేర్లు | ఓమకుచ్చి నరసింహన్ |
క్రియాశీలక సంవత్సరాలు | 1981-2008 |
భార్య/భర్త | సరస్వతి |
పిల్లలు | విజయలక్ష్మి, నిర్మల, కామేశ్వరన్ |
ప్రముఖ పాత్రలు | మంగమ్మగారి మనవడు |
జుట్టు నరసింహం ప్రముఖ హాస్యనటుడు. ఇతడు తెలుగు, తమిళ, మళయాల, కన్నడ మొదలైన 14 భారతీయ భాషలలో 1500 చలనచిత్రాలలో పనిచేశాడు. "ఇండియన్ సమ్మర్" అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటించాడు. తెలుగు సినిమా రంగంలో "జుట్టు నరసింహం"గా స్థిరపడిన ఈ నటుడు తమిళ సినిమాలలో "ఓమకుచ్చి నరసింహన్"(బక్క నరసింహన్)గా సుపరిచితుడు.
విశేషాలు
[మార్చు]ఇతడు తమిళనాడు రాష్ట్రం, కరూర్ జిల్లా, కట్టలై గ్రామంలో 1931లో జన్మించాడు. తన 13వ యేట అవ్వయార్ చిత్రంలో మొదటిసారి నటించాడు. చదువు పూర్తి చేసిన తరువాత కొంతకాలం జీవితభీమా సంస్థలో పనిచేశాడు. తర్వాత తన గురువు, నటుడు సురుళి రాజన్ ప్రోత్సాహంతో 1969లో తిరుకళ్యాణం అనే తమిళ సినిమాతో పునఃప్రవేశం చేశాడు. ఇతనికి భార్య సరస్వతి, కుమార్తెలు విజయలక్ష్మి, నిర్మల, కుమారుడు కామేశ్వరన్ ఉన్నారు. ఇతడు గొంతు కేన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన 78వ యేట 2009, మార్చి 11న మరణించాడు[1].
నటించిన తెలుగు సినిమాలు
[మార్చు]- మంగమ్మగారి మనవడు (1984)
- మా పల్లెలో గోపాలుడు (1985)
- కాష్మోరా (1986)
- అత్తగారూ స్వాగతం (1986)
- మన్నెంలో మొనగాడు (1986)
- ముద్దుల కృష్ణయ్య (1986)
- కృష్ణ లీల (1987)
- చక్రవర్తి (1987)
- సంసారం ఒక చదరంగం (1987)
- జీవన జ్యోతి (1988)
- దొరగారింట్లో దొంగోడు (1988)
- మురళీకృష్ణుడు (1988)
- రక్తతిలకం (1988)
- స్టేషన్ మాస్టర్ (1988)
- బాల గోపాలుడు (1989)
- ముద్దుల మావయ్య (1989)
- ఇదేం పెళ్లాం బాబోయ్ (1990)
- జస్టిస్ రుద్రమ దేవి (1990)
- పోలీస్ భార్య (1990)
- విష్ణు (1990)
- బలరామకృష్ణులు (1992)
- మావూరి మహారాజు (1994)
- మాతో పెట్టుకోకు (1995)
- పవిత్ర బంధం (1996)
- ఒకే ఒక్కడు (1999)
- దేవి (1999)
- భలేవాడివి బాసు (2001)