దేవత (1982 సినిమా)
అయోమయ నివృత్తి పేజీ దేవత చూడండి
దేవత1982 సంవత్సరం , సెప్టెంబర్10 న విడుదలైన చిత్రం.సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం లో శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద,మోహన్ బాబు,రావుగోపాలరావు తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు, కె రాఘవేంద్రరావు. విజయవంతమైన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చారు.
దేవత (1982 సినిమా) (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
నిర్మాణం | డి.రామానాయుడు |
తారాగణం | శోభన్ బాబు , శ్రీదేవి, జయప్రద, రావుగోపాలరావు, మోహన్ బాబు |
సంగీతం | కె. చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, పి.సుశీల |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
[మార్చు]ఊళ్ళో అందరికీ తలలో నాలుకలా ఉంటూ, స్వంత కష్టం మీద చెల్లెలు లలితను పట్నంలో చదివిస్తూంటుంది జానకి. ఆ గ్రామానికి చెందిన స్థితిమంతులు పార్వతమ్మ కుమారుడు రాంబాబు, లలిత ప్రేమించుకుంటూంటారు. ఐతే బాధ్యత తెలిసి వ్యవహరించే జానకిని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసుకుని కోడలిని చేసుకోవాలని పార్వతమ్మ ఆశిస్తూంటుంది. తనను పెంచి పెద్దచేసి, చదివిస్తూన్న అక్క జీవితం సుఖంగా ఉండాలని తన ప్రేమను త్యాగం చేస్తుంది లలిత. దాంతో జానకి-రాంబాబుల వివాహం జరుగుతుంది. ఆపైన ఏం జరిగిందన్నది మిగతా కథ.
నిర్మాణం
[మార్చు]సత్యానంద్ రాసిన ఈ కథను కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తీసేందుకు సురేష్ ప్రొడక్షన్స్ డి.రామానాయుడికి కథ చెప్పారు. కె.రాఘవేంద్రరావు తన తొలి సినిమానే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో చేయాల్సివున్నా 33వ సినిమా అయిన దేవత కథ చర్చించారు. ఐతే అప్పుడే వేటగాడు, అడవి రాముడు, జస్టిస్ చౌదరి వంటి మాస్ చిత్రాలు తీసిన రాఘవేంద్రరావు నుంచి మహిళలను ఆకట్టుకునే, కుటుంబ కథాత్మక చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా అని రామానాయుడు అనుమానించారు. ఐతే కథపై దర్శకుడికి ఉన్న నమ్మకాన్ని నిర్మాత విశ్వసించగా సినిమా ప్రారంభమైంది.[1]
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు ,
- శ్రీదేవి,
- జయప్రద,
- రావుగోపాలరావు,
- మోహన్ బాబు
- రమాప్రభ
- నగేష్
- సారథి
- మమత
- జయవాణి
- సి.హెచ్.విజయ
- పొన్ని
- సి.హెచ్.కృష్ణమూర్తి
- చిడతల అప్పారావు
- టెలిఫోన్ సత్యనారాయణ
- గిరిజారాణి
- మాస్టర్ సురేష్
- డబ్బింగ్ జానకి
- డాక్టర్ భాస్కరరావు
సాంకేతికవర్గం
[మార్చు]మాటలు - సత్యానంద్
పాటలు - ఆచార్య ఆత్రేయ , వేటూరి
సంగీతం - చక్రవర్తి
నిర్మాత - డి. రామానాయుడు
దర్శకత్వం - కే. రాఘవేంద్రరావు
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
"ఎల్లువొచ్చి గోదారమ్మ" | ఆత్రేయ, వేటూరి | కె. చక్రవర్తి | ఎస్. పి. బాలసుబ్రమణ్యం , పి. సుశీల |
"కుడి కన్ను కొట్టగానే" | ఆత్రేయ, వేటూరి | కె. చక్రవర్తి | ఎస్. పి. బాలసుబ్రమణ్యం , పి. సుశీల |
"చీర కట్టింద" | ఆత్రేయ, వేటూరి | కె. చక్రవర్తి | ఎస్. పి. బాలసుబ్రమణ్యం , పి. సుశీల |
"చల్లగాలి చెప్పింది" | ఆత్రేయ, వేటూరి | కె. చక్రవర్తి | ఎస్. పి. బాలసుబ్రమణ్యం , పి. సుశీల, ఎస్. పి. శైలజ |
"ఎండావాన" | ఆత్రేయ, వేటూరి | కె. చక్రవర్తి | ఎస్. పి. బాలసుబ్రమణ్యం , పి. సుశీల |
మూలాలు
[మార్చు]- ↑ విలేకరి, . "మూడు పదుల దేవత". Archived from the original on 14 జూలై 2017. Retrieved 11 July 2017.
{{cite news}}
:|first1=
has numeric name (help)
బయటి లింకులు
[మార్చు]- CS1 errors: numeric name
- 1982 తెలుగు సినిమాలు
- కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సినిమాలు
- సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు
- రామానాయుడు నిర్మించిన సినిమాలు
- శోభన్ బాబు నటించిన సినిమాలు
- శ్రీదేవి నటించిన సినిమాలు
- జయప్రద నటించిన సినిమాలు
- మోహన్ బాబు నటించిన సినిమాలు
- రావు గోపాలరావు నటించిన సినిమాలు
- రమాప్రభ నటించిన సినిమాలు