బేవర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేవర్స్
బేవర్స్ సినిమా పోస్టర్
దర్శకత్వంరమేశ్ చెప్పాల
రచనరమేశ్ చెప్పాల
నిర్మాతపొన్నాల చందు
డా.ఎం.ఎస్.మూర్తి
కో-అరవింద్
తారాగణంరాజేంద్ర ప్రసాద్
సంజోష్
హర్షిత
ఛాయాగ్రహణంకె. చిట్టిబాబు
కూర్పుఎం.ఆర్. వర్మ
సంగీతంసునీల్ కశ్యప్
నిర్మాణ
సంస్థ
శ్రీ సాయి కృపా ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
12 అక్టోబరు 2018 (2018-10-12)
సినిమా నిడివి
133 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

బేవర్స్ అనేది 2018 అక్టోబరు 12న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయి కృపా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్[1] పై పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, కో-అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన, దర్శకత్వం వహించాడు.[2] ఇందులో రాజేంద్ర ప్రసాద్,[3] సంజోష్, హర్షిత ప్రధాన పాత్రలు పోషించగా[4] సునీల్ కశ్యప్ సంగీతాన్ని స్వరపరిచాడు.[5][6][7][8]

కథా సారాంశం

[మార్చు]

సత్యమూర్తి (రాజేంద్ర ప్రసాద్) ఒక ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ఓనరు, అతని కొడుకు లక్కీ (సంజోష్) ఇంజనీరింగ్ చదువుతుంటాడు, కూతురు సిరి (సిరి) ఒక డెంటల్ హాస్పిటల్ జాబ్ చేస్తుంది. సత్యమూర్తి భార్య చనిపోయాక పిల్లలే లోకంగా బతుకుతాడు. గోడలకు పెయింటింగ్లు వేసిన దగ్గర నుంచి నేను జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను నా కొడుకు అలా కష్టపడకూడదని కనబడ్డ ప్రతి కోర్సు చదవమని అప్లై చేపిస్తాడు. అతని కొడుకు లక్కీ జీవితంలో త్వరగా సెటిల్ అవ్వాలని నిరంతరం తపిస్తాడు. తండ్రి పనులతో విసిగిపోయిన కొడుకు తనకిష్టమైన కోర్స్ కాకుండా ఇష్టం లేని చదువు తండ్రి కోసం చదవాల్సి వస్తుంది. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇద్దరు మధ్య గొడవ జరుగుతుంటుంది. ఇద్దరి మధ్య సిరి తల్లి లాగా ఉంటుంది. అన్న చెల్లెలకి ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఆరు నెలలు అమీర్పేట్లో ఎదో ఒక కోర్స్ చేస్తే సెటిల్ అవుతాను. నాకు సెటిల్ అవ్వాలని లేదు సక్సెస్ అవ్వాలని ఉంది అంటాడు లక్కీ. రెండింటికి తేడా ఏంటి ??!! అంటాడు సత్యమూర్తి. "ఏదో ఒకటి చేసి బతికితే సెటిల్ అయినట్టు, నచ్చింది చేస్తే సక్సెస్ అయినట్టు." అంటూ తన ఇంటెన్షన్ వినిపిస్తాడు లక్కీ, ప్రాణంగా ప్రేమించే సత్యమూర్తి కూతురు సిరి ఒకరోజు సడెన్ గా ఆత్మహత్య చేసుకుంటుంది. తను ఎందుకు అలా చేసిందో అర్థం కాదు. మాటల్లేని ఇద్దరూ ఒంటరి అవుతారు.

లక్కీకి తన చెల్లి మరణం అనుమానాస్పదంగా ఉందనీ గ్రహించి, రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తుంటాడు. అసలు నేరస్థుడు కార్తీక్ అని గుర్తిస్తాడు. కార్తీక్ వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ప్రవృత్తి "ప్లే బాయ్" ఎంతోమంది అమ్మాయిల జీవితాన్ని పాడు చేశాడని తెలుసుకుంటాడు. ఆ విషయాన్ని తన తండ్రికి తెలిసేలా చేయడంతో సత్యమూర్తి ఒకరోజు కార్తీక్‌ను చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తాడు. చివరగా తండ్రీ సత్యమూర్తి బేవర్స్ లా కనిపించే తన కొడుకు బేవర్స్ కాదనీ, మంచివాడుగా నటించిన ఆ కార్తీక్ గాడే బేవర్స్ అని గుర్తిస్తాడు, ఎండ్ లో.... తన కొడుకు లక్కికి ఇష్టమైన ఏరోనాటిక్స్‌లో చేర్చుతాడు. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలే కాదు, పిల్లలను అర్థం చేసుకోలేని తల్లిదండ్రులు కూడా బేవర్సే అనే సందేశంతో సినిమా ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
బేవర్స్
పాటలు by సునీల్ కశ్యప్
Released30 సెప్టెంబరు 2018 (2018-09-30)
Recorded2018
Genreసినిమా పాటలు
Length19:55
Languageతెలుగు
Labelఆదిత్యా మ్యూజిక్
Producerసునీల్ కశ్యప్
External audio
Audio Jukebox యూట్యూబ్లో

ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చారు. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[9]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నా ఇష్టమొచ్చినట్లు (రచన: భాస్కరభట్ల)"  అనురాగ్ కులకర్ణి, యాజిన్ నిజార్ 4:15
2. "రసక్కలి రసక్కలి (రచన: అరవింద్ మందెం)"  సునీల్ కశ్యప్ 3:33
3. "కాంతి పూల పండగ (రచన: భాస్కరభట్ల)"  హేమచంద్ర, దివ్య 4:08
4. "తల్లి తల్లి (రచన: సుద్దాల అశోక్ తేజ)"  సునీల్ కశ్యప్ 3:23
5. "రారా నా అత్తకొడుక (రచన: కాసర్ల శ్యామ్)"  అనురాగ్ కులకర్ణి, అశ్విని 3:00
6. "అంతులేని ప్రేమ (రచన: భాస్కరభట్ల)"  అశ్విని 1:11
19:55

మూలాలు

[మార్చు]
  1. "Bewars-Good Script Gone Wrong". 123 telugu.com. 12 October 2018.
  2. "'Bewars is a socially-conscious movie'". indiaglitz. 10 April 2018.
  3. "RP's Outburst Over Daughter's Love Marriage". Tupaki.com.
  4. "Bewars (Cast & Crew)". Nettv4u.
  5. "Bewars Review". Say Cinema.
  6. "Bewars is a pointless ride that confuses the viewers". The Times of India.
  7. "Bewars Movie Review". NTV. Archived from the original on 2018-12-19. Retrieved 2023-07-25.
  8. "Confusing and 'Bewars'". Telangana Today.
  9. "Bewars (Songs)". gaana.com.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బేవర్స్&oldid=3947520" నుండి వెలికితీశారు