భమ్ బోలేనాథ్
భమ్ బోలేనాథ్ | |
---|---|
దర్శకత్వం | కార్తీక్ వర్మ |
కథ | కార్తీక్ వర్మ దండు |
నిర్మాత | సిరివూరి రాజేష్ వర్మ, శ్రీకాంత్ దంతలూరి (సమర్పణ) |
తారాగణం | నవదీప్ పూజ ఝవేరి ప్రదీప్ మాచిరాజు నవీన్ చంద్ర |
ఛాయాగ్రహణం | భరణి కె. ధరణ్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | ఆర్.సి.సి. ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 27 ఫిబ్రవరి 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భమ్ బోలేనాథ్ 2015, ఫిబ్రవరి 27న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, నవీన్ చంద్ర, పూజ ఝవేరి నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు.
కథా నేపథ్యం
[మార్చు]నిరుద్యోగి అయిన వివేక్ (నవదీప్) ఉద్యోగం సంపాదించి ప్రేమించిన శ్రీలక్ష్మి (పూజ)ని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. దుబాయ్ వెళ్లి డాన్‌గా సెటిల్ అయిపోవాలని కలలు కనే కృష్ణ (నవీన్‌చంద్ర) దానికోసం డబ్బు సంపాదించడానికి దొంగతనాలు చేసి, ఆ సొమ్మంతా తాకట్టు వ్యాపారం చేసే సేఠ్ (పోసాని)కి ఇస్తుంటాడు. వసూలు రాజా అనే దొంగవ్యాపారి దగ్గర 2 లక్షలు అప్పుగా తీసుకొని వస్తున్న వివేక్ దగ్గరనుండి ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారు. నిత్యం మత్తులో మునిగి తేలే ఇద్దరు (ప్రదీప్, కిరీటి) ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవడానికని భారీగా డ్రగ్స్ క్యారీ చేస్తూ కారెక్కుతారు. ఈ మూడు కథలకు పాయింట్ ఓ కారు. ఆ కారులో కోట్ల డబ్బు, డ్రగ్స్, రింగ్ వుంటాయి. పోయాయనుకున్న వాటిని వీరు ఎలా దక్కించుకున్నారనేది మిగతా కథ.[2]
నటవర్గం
[మార్చు]- నవదీప్ (విష్ణు)
- పూజ ఝవేరి (శ్రీలక్ష్మీ)[3]
- ప్రదీప్ మాచిరాజు (రాకీ)
- నవీన్ చంద్ర (కృష్ణ)[4]
- కిరీటి దామరాజు (రోషన్)
- పోసాని కృష్ణ మురళి (సేత్జీ)
- పృథ్వీరాజ్ (పోలీస్ ఆఫీసరు)
- ప్రవీణ్ (కృష్ణ స్నేహితుడు)
- తాగుబోతు రమేష్
- ఫిష్ వెంకట్
- ధన్‌రాజ్
- కాదంబరి కిరణ్
- పంకజ్ కేసరి
- నవీన్ నేని
- రఘు పెన్మెత్స
- కాంచి
- రజిత
- మాధవి
- జెమిని సురేష్
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, కథనం, దర్శకత్వం: కార్తీక్ వర్మ
- నిర్మాత: సిరివూరి రాజేష్ వర్మ
- సహ నిర్మాతలు: కాకర్లపూడి రామకృష్ణ, యాడ్లపల్లి తేజ
- సమర్పణ: శ్రీకాంత్ దంతలూరి
- మాటలు: శరణ్ కొప్పిశెట్టి, కార్తిక్ వర్మ దండు
- సంగీతం: సాయి కార్తీక్
- కూర్పు: ప్రవీణ్ పూడి
- ఛాయాగ్రహణం: భరణి కె. ధరణ్
- డ్యాన్స్: విజయ్
- ఆర్ట్: జె.కె.మూర్తి
- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రఘు పెన్మత్స
- నిర్మాణ సంస్థ: ఆర్.సి.సి. ఎంటర్టైన్మెంట్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. తన్మయి మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
భమ్ బోలేనాథ్ | ||||
---|---|---|---|---|
సాటలు by | ||||
Released | డిసెంబరు 6, 2014 | |||
Recorded | 2014 | |||
Genre | పాటలు | |||
Length | 15:14 | |||
Label | తన్మయి మ్యూజిక్ | |||
Producer | సాయి కార్తీక్ | |||
సాయి కార్తీక్ chronology | ||||
|
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "భమ్ బోలేనాథ్ (రచన: బి. సుబ్బరాయశర్మ)" | సిద్ధార్ధ్ వాట్కిన్స్ | 3:05 | ||||||
2. | "మనసే (రచన: బాలాజీ)" | హరిచరణ్, సైంధవి | 4:05 | ||||||
3. | "ఉన్నోడైనా (రచన: బి. సుబ్బరాయశర్మ)" | రంజిత్ | 3:32 | ||||||
4. | "వన్స్ అపాన్ ఏ టైమ్ (రచన: కృష్ణ చైతన్య)" | ఎన్. సి. కారుణ్య, సుచిత్ర | 2:24 | ||||||
5. | "సేటుగర్ (రచన: బాలాజీ)" | ఎన్. సి. కారుణ్య, సుచిత్ర | 2:08 | ||||||
15:14 |
ఇతర వివరాలు
[మార్చు]- ఈ చిత్రానికి సంబంధించిన జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియోను రానా నేడు ట్విట్టర్‌లో విడుదల చేశాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ newstel. "Bham Bholenath and Ram Leela First day Box office Collection". Telugu Cinema News India. Archived from the original on 11 మార్చి 2015. Retrieved 24 February 2020.
- ↑ తెలుగు వెబ్ దునియా, రివ్యూ. "'భమ్ బోలోనాథ్'... మూడు జంటల కథ... రివ్యూ రిపోర్ట్". telugu.webdunia.com. Retrieved 24 February 2020.
- ↑ ప్రజాశక్తి, మూవీ (8 November 2016). "పౌరాణికం ఇష్టం పూజా జవేరి". Archived from the original on 5 April 2017. Retrieved 24 February 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (2 November 2015). "పొరపాట్ల వల్లే ఫ్లాపులొచ్చాయన్న నవీన్ చంద్ర". Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.
- ↑ ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Archived from the original on 18 March 2015. Retrieved 24 February 2020.