వ్యవసాయ పాడిపంటలు (పత్రిక)
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రచురించే తెలుగు మాసపత్రిక పాడిపంటలు. ఇది 1952 లో మొదలైంది. జులై 1993 న 50 ఏళ్ల ప్రత్యేక సంచిక వెలువడింది. 2015 జనవరి నుండి సంచికలు వెబ్ లో అందుబాటులో వున్నాయి. వ్యవసాయ పాడిపంటలు ప్రస్తుతపేరు.[1]
రైతాంగానికి సలహాలు, సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు వ్యవసాయరంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు, అభివృద్ధి గురించి తెలియచేయటం, ప్రభుత్వ పథకాలు, రాయితీల సమాచారం ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
వ్యవసాయ శాఖ కమీషనర్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ పత్రిక వెలువడుతుంది. ప్రతి నెల సంచికలో ఆ నెలలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి జిల్లా అనుబంధంలో వివరిస్తారు.
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "వ్యవసాయ పాడిపంటలు జాలస్థలి". Archived from the original on 2019-12-07. Retrieved 2020-01-18.