శ్రీలంక దాల్చిన చెక్క

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీలంక దాల్చినచెక్క
C. verum foliage and flowers
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
C. verum
Binomial name
Cinnamomum verum
Synonyms[1]
  • Camphorina cinnamomum (L.) Farw.
  • C. aromaticum J.Graham
  • C. barthii Lukman.
  • C. bengalense Lukman.
  • C. biafranum Lukman.
  • C. bonplandii Lukman.
  • C. boutonii Lukman.
  • C. capense Lukman.
  • C. carolinense var. oblongum Kaneh.
  • C. cayennense Lukman.
  • C. cinnamomum (L.) H.Karst. nom. inval.
  • C. commersonii Lukman.
  • C. cordifolium Lukman.
  • C. decandollei Lukman.
  • C. delessertii Lukman.
  • C. ellipticum Lukman.
  • C. erectum Lukman.
  • C. humboldtii Lukman.
  • C. iners Wight [Illegitimate]
  • C. karrouwa Lukman.
  • C. leptopus A.C.Sm.
  • C. leschenaultii Lukman.
  • C. madrassicum Lukman.
  • C. maheanum Lukman.
  • C. mauritianum Lukman.
  • C. meissneri Lukman.
  • C. ovatum Lukman.
  • C. pallasii Lukman.
  • C. pleei Lukman.
  • C. pourretii Lukman.
  • C. regelii Lukman.
  • C. roxburghii Lukman.
  • C. sieberi Lukman.
  • C. sonneratii Lukman.
  • C. vaillantii Lukman.
  • C. variabile Lukman.
  • C. wolkensteinii Lukman.
  • C. zeylanicum Blume nom. illeg.
  • C. zeylanicum Breyn.
  • C. zollingeri Lukman.
  • Laurus cinnamomum L.

శ్రీలంక దాల్చిన చెక్కను నిజమైన దాల్చిన చెక్క అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం Cinnamomum verum. ఇది లారేసి కుటుంబానికి చెందినది. ఈ చెట్టు బెరడును దాల్చిన చెక్క అనే సుగంధ ద్రవ్యముగా వాడుతున్నారు. ఈ చెట్టు మూలాలు శ్రీలంకకు చెందినవి. ఇది చిన్న సతత హరిత వృక్షం. ఈ చెట్టు 10 నుంచి 15 మీటర్ల (32.8–49.2 అడుగులు) ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు దీర్ఘచతురస్రాండాకారములో 7-18 సెం.మీ. (2.75-7.1 అంగుళాలు) పొడవు ఉంటాయి. దీని పుష్పాలు గుత్తులుగా అమరి ఉంటాయి, ఇవి ఆకుపచ్చని రంగుతో, విస్పష్టమైన వాసన కలిగి ఉంటాయి.

The fruit is a purple 1-cm berry containing a single seed.

సాగు

[మార్చు]

దీని సాగుకు 2000 నుంచి 2500 మి.మీ. వర్షపాతంగల ఎత్తయిన ప్రదేశాలు అనుకూలం. కంకర నేలలు, గరపనేలలు నీటి ముంపుకు గురి అయ్యే భూములు దీని సాగుకు పనికిరావు. నాణ్యత పండించిన నేల ఇతర పరిస్థితులపై ఆధారపడి వుంటుంది. దీనిని విత్తనాల ద్వారా శాఖీయ పద్ధతుల ద్వారా ప్రవర్థనం చేస్తారు. విత్తనాలను పండ్ల నుంచి వేరుచేశాక వీలైనంత త్వరగా నాటుకోవాలి. విత్తనాలు నాటుట అలస్యమైన కొద్దీ మొలకెత్తే శాతం తగ్గిపోతుంది. విత్తనాలను నారుమళ్లలో 20 సెం.మీ. దూరంలో నాటాలి. మొక్కలు 4 నెలల వయసులో నారుమడి నుండి తీసి బుట్టలలో/పాలిథీన్ సంచులలో నాటుకొని మొక్కకు మరొక 5 నెలల వయస్సు వచ్చినపుడు పొలంలో నాటుకోవాలి. మొక్కను తొలిదశలో ఎండనుంచి కాపాడాలి. మొక్కలు రెండేళ్ళు పెరిగాక కొమ్మలను భూమి నుంచి అర అడుగు ఎత్తులో నరికివేసి మొక్కను మట్టితో కప్పాలి. దీనికి నీరు, ఎరువులు అందిస్తే కొత్త కొమ్మలు భూమి నుంచి వస్తాయి. వాటిలో సరియైన 4 లేదా 6 కొమ్మలను పెరగనిచ్చి మిగిలినవి తీసివేయాలి. పెరిగిన ఈ కొమ్మలు తిరిగి రెండేళ్ళలో కోతకు తయారవుతాయి. కోతకు వచ్చిన కొమ్మలను వర్షాకాలంలో కొత్తగా వచ్చిన ఆకులు ఎరుపు రంగు నుంచి ఆకుపచ్చ రంగులోకి మారుతున్నప్పుడు కత్తిరించాలి. మొక్కలో బయటివైపుకు ఉన్న కొమ్మల కంటే లోపలివైపు ఉన్న కొమ్మల నుంచి మంచి నాణ్యతగల బెరడు లభిస్తుంది. ఇలా నరికిన కొమ్మల నుంచి బెరడు తీసి శుద్ధిచేయడానికి ఎంతో నైపుణ్యత కావాలి.

శుద్ధి చేయటంలోని ముఖ్య అంశాలు ఏమిటనగా.

1. కొమ్మలు ముదిరిన వాటిని ఎంపిక చేసి సకాలంలో కత్తిరించుట.

2. బెరడు మీదనున్న గరకు పొరను బెరడు దెబ్బతినకుండా తొలగించుట.

3. బెరడును లోపల గల కర్ర నుంచి వేరుచేయటం.

4. తీసిన బెరడును ఆరబెట్టి నాణ్యతనుబట్టి వివిధ గ్రేడ్లలో వేరుచేయటం.

దాల్చిన చెక్కలో రెండు రకాల తెగుళ్ళు వస్తాయి. చారలతో కూడిన గజ్జి తెగులు. ఇది ఎక్కువగా కాండం శాఖలపై వస్తుంది. వేరుకుళ్ళు తెగులును కూడా దాల్చిన చెక్కలో గమనించవచ్చు. శిలీంద్రనాశక మందులను వాడి వీనిని నివారించుకోవాలి.

రకాలు

[మార్చు]

బెరడు యొక్క రుచిని బట్టి శ్రీలంక దాల్చిన చెక్క యొక్క వివిధ పంటలు:

  • Type 1 Sinhala: Pani Kurundu (පැණි කුරුඳු), Pat Kurundu (පත් කුරුඳු) or Mapat Kurundu (මාපත් කුරුඳු)
  • Type 2 Sinhala: Naga Kurundu (නාග කුරුඳු)
  • Type 3 Sinhala: Pani Miris Kurundu (පැණි මිරිස් කුරුඳු)
  • Type 4 Sinhala: Weli Kurundu (වැලි කුරුඳු)
  • Type 5 Sinhala: Sewala Kurundu (සෙවල කුරුඳු)
  • Type 6 Sinhala: Kahata Kurundu (කහට කුරුඳු)
  • Type 7 Sinhala: Pieris Kurundu (පීරිස් කුරුඳු)

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The Plant List". Archived from the original on 2018-10-24. Retrieved 2013-06-02.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.