హెపటైటిస్ ఎ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హెపటైటిస్ ఎ వలన వచ్చే పచ్చకామెర్ల వ్యాధి

హెపటైటిస్ ఎ (గతంలో సంక్రమిత హెపటైటిస్ అని పిలిచేవారు) అనేది హెపటైటిస్ ఎ వైరస్ (HAV) వలన కలిగే కాలేయం యొక్క తీవ్రమైన సంక్రమిత వ్యాధి.[1] చాలా కేసులలో ముఖ్యంగా యువతలో తక్కువ లక్షణాలు ఉంటాయి లేదా లక్షణాలు ఉండవు.[2] ఇన్ఫెక్షన్, లక్షణాలు పెరిగే వారిలో వాటి మధ్య సమయం రెండు నుండి ఆరు వారాల మధ్య ఉంటుంది.[3] లక్షణాలు ఉన్నప్పుడు అవి సాధారణంగా ఎనిమిది వారాలు ఉంటాయి, వీటిలో ఇవి ఉండవచ్చు: వికారం, వాంతులు, నీళ్ళ విరేచనాలు, పసుపురంగులో చర్మం, జ్వరం, కడుపు నొప్పి.[2] మొదటిగా ఇన్ఫెక్షన్ సోకిన తరువాత ఆరు నెలలలో సుమారు 10–15% మందిలో లక్షణాలు పునరావృతమవుతారు.[2] పెద్దవారిలో ఇది మరింత సర్వసాధారణంగా ఉండటంతో దీనితోపాటు తీవ్రమైన కాలేయ వైఫల్యం చాలా అరుదుగా సంభవించవచ్చు.[2]


ఇది సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకిన మలంతో కూడిన కలుషితమైన ఆహారం తినటం లేదా తాగడం ద్వారా వ్యాపిస్తుంది.[2] వేరేవాటితో పోల్చిచూస్తే తగినంతగా ఉడికించని నత్తలు ఒక  సాధారణమైన వనరుగా కూడా ఉంది.[4] వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవటం ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది.[2] పిల్లలకు వ్యాధి సోకినప్పుడు, వారిలో తరచుగా లక్షణాలు కనిపించకపోయినా, వారు వ్యాధిని ఇతరులకు వ్యాపింప చేయగలరు.[2] ఒక ఇన్ఫెక్షన్ సోకిన తరువాత ఆ వ్యక్తి జీవితాంతం దీనికి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు.[5] రోగ నిర్ధారణకు రక్తాన్ని పరీక్షించటం అవసరం, ఎందుకంటే దీని లక్షణాలు అనేక ఇతర వ్యాధుల మాదిరిగానే ఉంటాయి.[2] ఇది మనకి తెలిసిన ఐదు హెపటైటిస్ వైరస్‌లలో అంటే ఎ, బి, సి, డి, ఇ లలో ఒకటి.

హెపటైటిస్ ఎ టీకా వ్యాధిని నివారించుటలో ప్రభావవంతంగా ఉంది.[2][6] కొన్ని దేశాలు మామూలుగా పిల్లలకు, గతంలో టీకాలు వేయించుకోని అధిక ప్రమాదం గల వ్యక్తులకు దీన్ని సిఫార్సు చేస్తున్నాయి.[2][7] ఇది జీవిత కాలంలో ప్రభావవంతంగా ఉండటం కనిపిస్తుంది.[2] ఇతర నివారణ చర్యలలో చేతులు కడుక్కోవడం, ఆహారాన్ని సరిగా వండటం వంటివి ఉన్నాయి.[2] దీనికి ప్రత్యేకమైన చికిత్స ఏమీ లేదు, వికారం లేదా అతి విరేచనాలకు అవసరమైన ప్రాతిపదికన విశ్రాంతి, మందులు సిఫార్సు చేయబడతాయి.[2] సాధారణంగా ఇన్ఫెక్షన్లు పూర్తిగా సమసిపోతాయి, పాక్షికమైన కాలేయ వ్యాధికి దారితీయకుండానే తగ్గిపోతాయి.[2] తీవ్రమైన కాలేయ వైఫల్యానికి చికిత్స అంటే ఒకవేళ దాన్ని చేయాలంటే, అది కాలేయ మార్పిడిగా ఉంది.[2]

ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద కొన్ని కోట్ల ఇన్ఫెక్షన్లతో పాటు ప్రతి సంవత్సరం 15 లక్షల రోగ లక్షణ సంబంధిత కేసులు సంభవిస్తాయి.[2][8] సరైన పారిశుధ్యం, తగినంత సురక్షితమైన నీరు లేని ప్రపంచంలోని ప్రాంతాలలో ఇది మరింత సర్వసాధారణం.[7] అభివృద్ధి చెందుతున్న దేశాలలో 90% మంది పిల్లలు 10 సంవత్సరాల వయస్సులో ఇన్ఫెక్షన్‌కు గురవుతున్నారు కాబట్టి యుక్తవయస్సులో రోగనిరోధక శక్తిని పొందుతున్నారు.[7] పిల్లల చిన్నతనంలో వ్యాధికి గురికాని, వారికి విస్తృతంగా టీకాలు వేయని మధ్యస్తంగా అభివృద్ధి చెందిన దేశాలలో సంక్రమణ విజృంభణ తరచుగా సంభవిస్తుంది, 2010 లో, తీవ్రమైన హెపటైటిస్ ఎ ఫలితంగా 102,000 మంది మరణించారు.[9] వైరల్ హెపటైటిస్ పట్ల అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జరుగుతుంది.[7]

మూలాలు

[మార్చు]
  1. Ryan KJ, Ray CG (editors) (2004). Sherris Medical Microbiology (4th ed.). McGraw Hill. pp. 541–4. ISBN 0-8385-8529-9.
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 2.11 2.12 2.13 2.14 2.15 Matheny, SC; Kingery, JE (1 December 2012). "Hepatitis A." Am Fam Physician. 86 (11): 1027–34, quiz 1010–2. PMID 23198670.
  3. Connor BA (2005). "Hepatitis A vaccine in the last-minute traveler". Am. J. Med. 118 (Suppl 10A): 58S–62S. doi:10.1016/j.amjmed.2005.07.018. PMID 16271543.
  4. Bellou, M.; Kokkinos, P.; Vantarakis, A. (March 2013). "Shellfish-borne viral outbreaks: a systematic review". Food Environ Virol. 5 (1): 13–23. doi:10.1007/s12560-012-9097-6. PMID 23412719.
  5. The Encyclopedia of Hepatitis and Other Liver Diseases. Infobase. 2006. p. 105. ISBN 9780816069903.
  6. Irving, GJ.; Holden, J.; Yang, R.; Pope, D. (2012). "Hepatitis A immunisation in persons not previously exposed to hepatitis A.". Cochrane Database Syst Rev. 7: CD009051. doi:10.1002/14651858.CD009051.pub2. PMID 22786522.
  7. 7.0 7.1 7.2 7.3 "Hepatitis A Fact sheet N°328". World Health Organization. July 2013. Retrieved 20 February 2014.
  8. Wasley, A; Fiore, A; Bell, BP (2006). "Hepatitis A in the era of vaccination". Epidemiol Rev. 28: 101–11. doi:10.1093/epirev/mxj012. PMID 16775039.
  9. Lozano, R; Naghavi, M; Foreman, K; Lim, S; Shibuya, K; Aboyans, V; Abraham, J; Adair, T; Aggarwal, R,; Ahn, SY; et al. (Dec 15, 2012). "Global and regional mortality from 235 causes of death for 20 age groups in 1990 and 2010: a systematic analysis for the Global Burden of Disease Study 2010". Lancet. 380 (9859): 2095–128. doi:10.1016/S0140-6736(12)61728-0. PMID 23245604.