పాట్రిక్ కవనాగ్
పాట్రిక్ కవనాగ్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | ఇన్సిస్కీన్, ఐర్లాండ్ | 1904 అక్టోబరు 21
మరణం | 1967 నవంబరు 30 డబ్లిన్, ఐర్లాండ్ | (వయసు 63)
వృత్తి | కవి |
జాతీయత | ఐరిష్ |
కాలం | 1928–1967 |
రచనా రంగం | నవలా రచయిత, పాత్రికేయుడు. |
విషయం | ఐరీష్ జీవితం, ప్రకృతి |
పాట్రిక్ కవనాగ్ (అక్టోబర్ 21, 1904 - నవంబర్ 30, 1967) ఐర్లాండ్ దేశానికి చెందిన కవి, నవలా రచయిత, పాత్రికేయుడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]పాట్రిక్ కవనాగ్ 1904, అక్టోబరు 21న ఐర్లాండ్ లోని కౌంటీ మొనఘన్, ఇన్సిస్కీన్ గ్రామంలోని రైతు కుటుంబంలో పది మంది సంతానంలో నాలుగోవాడిగా జన్మించాడు.[2] పాట్రిక్ తాత పాఠశాల ఉపాధ్యాయుడు.[3][4] 13వ ఏట 6వ తరగతిలోనే చదువుమానేసి తన తండ్రితోపాటు వ్యవసాయం చేశాడు, చర్మకారుడిగా బూట్లు తయారుచేశాడు.[5] ఆ తర్వాత కొంతకాలం ఫుట్‌బాల్ ఆటపై ఆసక్తి చూపించాడు.
రచనా ప్రస్థానం
[మార్చు]పాట్రిక్ 24వ ఏట ఐరిష్ సాహితీవేత్త జార్జ్ విలియమ్ రస్సెల్ ప్రోత్సాహంతో తాను చూసిన, అనుభవించిన జీవితంలోంచే రచనలు చేయడం ప్రారంభించాడు. గ్రామీణ యాసతో అతిశయోక్తులు లేకుండా సహజంగా రచనలు చేశాడు. కొంతకాలం లండన్, ఆ తర్వాత డబ్లిన్‌లో, బెల్ఫాస్ట్ నగరాల్లో జీవించాడు. తన జీవితాన్ని ఆత్మకథ నవలగా టారి ఫ్లిన్ (1948) పేరుతో రాశాడు. అది కొంతకాలం పాటు నిషేధానికి గురైంది.
కవిత్వం
[మార్చు]- 1936 - ప్లోవ్మన్ అండ్ అదర్ పోయమ్స్
- 1942 - ది గ్రేట్ హంగర్
- 1947 - ఎ సోల్ ఫర్ సేల్
- 1958 - రీసెంట్ పోయెమ్స్
- 1960 - కమ్ డ్యాన్స్ విత్ కిట్టి స్టోలింగ్ అండ్ అదర్ పోయెమ్స్
- 1964 - కలెక్టెడ్ పోయెమ్స్ (ISBN 0 85616 100 4)
- 1972 - ది కంప్లీట్ పోయెమ్స్ ఆఫ్ ప్యాట్రిక్ కావనాగ్, ఎడిటెడ్ బై పీటర్ కావనాగ్
- 1978 - లాఫ్ డెర్గ్
- 1996 - సెలెక్టెడ్ పోయెమ్స్, ఎడిటెడ్ బై ఆంటోయినెట్టే క్విన్ (ISBN 0140184856)
- 2004 - సెలెక్టెడ్ పోయెమ్స్, ఎడిటెడ్ బై ఆంటోయినెట్టే క్విన్ (ISBN 0-713-99599-8)
వచనాలు
[మార్చు]- 1938 - ది గ్రీన్ ఫూల్
- 1948 - టారి ఫ్లిన్ (ISBN 0141183616)
- 1964 - సెల్ఫ్ పోర్ట్రెయిట్ - రికార్డింగ్
- 1967 - కలెక్టెడ్ ప్ర్యూజ్
- 1971 - నవంబర్ హగ్గార్డ్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోస్ అండ్ పోయెట్రీ ఎడిటెడ్ బై పీటర్ కవనాగ్
- 1978 - బై నైట్ నైట్స్టార్డ్. ఎ కన్ల్ఫేటెడ్ నావల్, కంప్లీటెడ్ బై పీటర్ కవనాగ్
- 2002 - ఎ పోయెట్స్ కంట్రీ: సెలెక్టడ్ ప్రోస్, ఎడిటెడ్ బై ఆంటోనిట్టే క్విన్ (ISBN 1843510103)
మరణం
[మార్చు]పాట్రిక్ కవనాగ్ 1967, నవంబరు 30తన 63ఏళ్ళ వయసులో ఐర్లాండ్ లోని డబ్లిన్ లో మరణించాడు.[6]
మూలలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, చెలిమె-ప్రపంచ కవిత (1 April 2019). "పాట్రిక్ కవనాగ్". మామిడి హరికృష్ణ. Archived from the original on 1 April 2019. Retrieved 1 April 2019.
- ↑ "National Archives". Census.nationalarchives.ie. 27 August 2009. Retrieved 1 March 2019.
- ↑ Finlan, Michael (1 March 2019). "Monoghan Nun Finds Kavanagh's Lost Past". The Irish Times.
- ↑ "The Mystical Imagination of Patrick Kavanagh". Spirituality. Catholicireland.net. 1999.
- ↑ Profile from the Patrick Kavanagh Trust
- ↑ "Poetry Archive profile". Archived from the original on 2014-02-27. Retrieved 2019-04-01.