రాజ్‌గఢ్ జిల్లా
Rajgarh జిల్లా
राजगढ़ जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Bhopal |
ముఖ్య పట్టణం | Rajgarh (Madhya Pradesh) |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Rajgarh |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,154 కి.మీ2 (2,376 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 15,45,814 |
• జనసాంద్రత | 250/కి.మీ2 (650/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 61.21 % |
ప్రధాన రహదార్లు | NH-3, NH-12 |
Website | అధికారిక జాలస్థలి |
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో రాజ్‌గఢ్ జిల్లా ఒకటి. రాజ్‌గఢ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6,154 చ.కి.మీ 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1,545,814.[1] జిల్లా మాల్వా రాష్ట్ర ఉత్తర సరిహద్దులో ఉంది.జిల్లా తూర్పు సరిహద్దులో పర్భాతి నది ప్రవహిస్తుంది. పశ్చిమ సరిహద్దులో కాళిసింధ్ నది ప్రవహిస్తుంది.
విభాగాలు
[మార్చు]జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి : రాజ్గర్, ఖిల్చిపుర్, జిరపుర్, భీఒర, నర్సింఘ్గర్, సరంగ్పుర్, పచొరె.
సరిహద్దులు
[మార్చు]జిల్లా ఉత్తర సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రం, వాయవ్య సరిహద్దులో గునా జిల్లా, తూర్పు సరిహద్దులో భోపాల్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో సెహోర్ జిల్లా, దక్షిణ, ఉత్తర సరిహద్దులో షాజాపూర్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా భోపాల్ డివిజన్‌లో ఉంది. 1948 మే మాసంలో ఈ జిల్లా రూపొందించబడింది. గతంలో ఈ ప్రాంతం రాజ్‌గఢ్, నర్సింగ్‌గర్, ఖిల్చిపూర్ రాజాస్థానాలు దేవాస్ జూనియర్, దేవాస్ సీనియర్ (ప్రస్తుత సరంగ్‌పూర్ తాలూకా) నుండి ఇండోర్‌లోని జిరాపూర్ తాలూకా (ప్రస్తుత ఖిల్చిపూర్ తాలూకా) భూభాగం సేకరించి జిల్లా రూపొందించబడింది.
పర్యాటక ఆకర్షణలు
[మార్చు]జిల్లాలో రాజ్‌గఢ్, ఖిల్చిపూర్, కొత్రవిహార్, నర్సింగ్‌పూర్ పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రాజ్‌గఢ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,545,814,[1] |
ఇది దాదాపు. | మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 322వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 23.26%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 956: 1000 |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 61.21%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 http://www.census2011.co.in/census/district/309-rajgarh.html
- ↑ 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-27. Retrieved 2014-11-23.
- ↑ http://www.census2011.co.in/district.php