శివ్‌పురి జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Shivpuri జిల్లా
शिवपुरी जिला
మధ్య ప్రదేశ్ పటంలో Shivpuri జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Shivpuri జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుGwalior
ముఖ్య పట్టణంShivpuri
విస్తీర్ణం
 • మొత్తం10,298 కి.మీ2 (3,976 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం17,25,818
 • జనసాంద్రత170/కి.మీ2 (430/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత63.73%
 • లింగ నిష్పత్తి877 females over 1000 males
ప్రధాన రహదార్లుNH3 and NH25
సగటు వార్షిక వర్షపాతంJuly to September మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
మాధవ్ నేషనల్ పార్క్‌లోని సరస్సు

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో శివ్‌పురి జిల్లా (హిందీ:) ఒకటి. శివ్‌పురి పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. బదర్వాస్, కరేరా, ఖనియాధానా, కొలరాస్, నర్వార్, పిచోర్. కాలిసింధ్ నదికి తూర్పున శివ్‌పురి పట్టణానికి 41కి.మీ దూరంలో ఉన్న నర్వార్ పట్టణం చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. నర్వార్‌కు చెందిన మెడీవల్ అరణ్యాలకు ఈ ప్రాంతం ప్రాముఖ్యత కలిగి ఉంది. శివ్‌పురిలో ప్రముఖ మాధవ్ నేషనల్ పార్క్ ఉంది. శివ్‌పురి జిల్లా భౌగోళిక వైవిధ్యం కలిగి ఉంది. జిల్లాలోని సరోవరం చుట్టూ అరణ్యాలు, కొండలు, పసరిక బయళ్ళు ఉన్నాయి. 1918లో నేషనల్ పార్క్ ముఖద్వారానికి సమీపంలో మనియర్ నదీజలాలతో ఏర్పాటు చేయబడిన సఖ్యసాగర్, మాధవ్ సాగర్ సరోవరాలు నేషనల్ పార్క్ భౌగోళిక వైవిధ్యానికి, ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా ఉన్నాయి.

ప్రముఖులు

[మార్చు]

గి.ఎస్ ధిల్లాన్ : 1945లో సంభవించిన చారిత్రక విపత్తులో ప్రాణాలతో బయటపడిన చివరి వ్యక్తిగా గి.ఎస్ ధిల్లాన్‌కు ప్రత్యేకత ఉంది. ఆయన తన మరణాంతం వరకు శివ్‌పురి జిల్లాలోని హోతద్ గ్రామంలో నివసించాడు.

చరిత్ర

[మార్చు]

గ్వాలియర్ రాజాస్థానంలోని నార్వార్ జిల్లాకు శివ్‌పురి కేంద్రంగా ఉండేది. భరతదేశానికి స్వతంత్రం వచ్చున తరువాత గ్వాలియర్ రాజాస్థానం సమైక్యభారతదేశంతో విలీనం అయింది. స్వాతంత్ర్యం తరువాత ఆగ్నేయంలో ఖనిధానా రాజాస్థానం, ఈశాన్య సరిహద్దులో దతియా రాజాస్థానం, వాయవ్య సరిహద్దులో పూరీ రాజాస్థానాల మధ్య శివ్‌పురి జిల్లా రూపొందించబడింది. స్వతంత్రం తరువాత శివ్‌పురి జిల్లా మధ్యభారతంలో భాగంగా ఉండేది. 1956 తరువాత శివ్‌పురి జిల్లా మధ్యప్రదేశ్‌లో భాగంగా మారింది.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో శివ్‌పురి జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,725,818, [2]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 280వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 168 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 22.74%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 877:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 63.73%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nebraska 1,826,341

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]